తండేల్ నాన్-థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే..
సముద్రం నేపథ్యంలోని ఓ నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By: Tupaki Desk | 3 Feb 2025 11:05 AM GMTయువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న "తండేల్" సినిమా ఈ ఏడాది టాలీవుడ్‌లోనే అత్యంత భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో ఒకటిగా మారింది. సముద్రం నేపథ్యంలోని ఓ నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం ప్రమోషన్ గ్రాండ్ గా నిర్వహిస్తూ, సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కి ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ సాధించింది.
రాక్ స్టార్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా "బుజ్జితల్లి" పాట యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఈ పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్ విషయంలో మేకర్స్ కొత్తదనంతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈవెంట్స్ సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చాయి.
ఇక లేటెస్ట్ గా "తండేల్" నాన్-థియేట్రికల్ రైట్స్‌తో భారీగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.35 కోట్లకు సొంతం చేసుకుంది. అదే విధంగా, ఆడియో రైట్స్ రూపంలో రూ.7 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కులు రూ.8 కోట్లు, శాటిలైట్ హక్కులు మరో రూ.10 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తంగా, నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా రూ.60 కోట్ల భారీ బిజినెస్ చేసుకుంది. ఈ మొత్తం చూస్తుంటే, సినిమా విడుదలకు ముందే బడ్జెట్‌లో సగానికి పైగా రికవరీ అయినట్లే. "తండేల్" మొత్తం బడ్జెట్ దాదాపు రూ.90 కోట్లు అని సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓవర్సీస్, ఇతర భాషల హక్కులు, థియేట్రికల్ షేర్ రూపంలో వచ్చే వసూళ్లు కలిసి సినిమాకు భారీ లాభాలు తీసుకురావడం గ్యారెంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓ పాన్-ఇండియా సినిమా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ త్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు "తండేల్" సిద్ధమవుతోంది. ఈ సినిమాతో నాగచైతన్య తన కెరీర్‌లో మరో మెమరబుల్ హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయం సాధిస్తే, నాగచైతన్య కెరీర్‌లోనే ఓ స్పెషల్ ఫిల్మ్‌గా నిలిచే అవకాశం ఉంది. మరి, ఈ సినిమా థియేటర్లలో ఎంత వరకూ విజయం సాధిస్తుందో వేచి చూడాలి.