Begin typing your search above and press return to search.

శోభితను కూడా రేసులోకి దింపిన చైతూ

నాగచైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు బైకులు, కార్లు, స్పోర్ట్స్ వెహికల్స్ లవర్ అని అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2025 11:55 AM IST
శోభితను కూడా రేసులోకి దింపిన చైతూ
X

నాగచైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు బైకులు, కార్లు, స్పోర్ట్స్ వెహికల్స్ లవర్ అని అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నోసార్లు అతడు రేస్ ట్రాక్స్‌పై కనిపించాడు. ఇప్పుడు ఇదే ఆసక్తిని తన భార్య, గ్లామరస్ బ్యూటీ శోభిత ధూళిపాళతో కూడా షేర్ చేసుకోవడం విశేషం. తాజాగా చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో రేసింగ్ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రత్యేకమైన మూమెంట్స్‌ను షేర్ చేయగా, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బ్లాక్ టాప్, ఖాకీ ట్రౌజర్స్‌లో స్టైలిష్ లుక్‌లో ఉన్న శోభిత, కూల్ అండ్ క్యాజువల్ అవతార్‌లో ఉన్న చైతు ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక శోభిత నేరుగా రేసింగ్ కార్ డ్రైవ్ చేస్తున్న స్టిల్స్‌ మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. హెల్మెట్ ధరించి రేస్ ట్రాక్‌పై స్ట్రాంగ్ ఫోకస్‌ పెట్టిన ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ ఫోటోలు వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీని మరింత హైలైట్ చేస్తున్నాయి. నాగచైతన్య, శోభితల మధ్య బంధం ఎంత బాగుంటుందో మరోసారి క్లారిటీగా అర్ధమవుతుంది. ఫోటోల విషయానికొస్తే, శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రేస్ ఫ్లాగ్ ఎమోజీని మాత్రమే క్యాప్షన్‌గా పెట్టడం గమనార్హం. అయితే, చైతు కెరీర్ పరంగా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అదే ట్రాక్ లో హ్యాపీగా వెళ్లేలా చేస్తున్నారు.

అలాగే శోభిత కూడా బాలీవుడ్‌లో మంచి అవకాశాలతో ముందుకెళ్తోంది. రీసెంట్ గా నాగచైతన్య తండేల్ సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా సినిమా బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక మరోవైపు కార్తిక్ దండు దర్శకత్వంలో మరో థ్రిల్లర్ సినిమాను స్టార్ట్ చేసిన చైతూ మరో రెండు కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు.