Begin typing your search above and press return to search.

తండేల్ ఈవెంట్ కు ఫ్యాన్స్ రావడం లేదా??

జీఏ2 ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 5:58 AM GMT
తండేల్ ఈవెంట్ కు ఫ్యాన్స్ రావడం లేదా??
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య.. తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. జీఏ2 ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

అయితే ఫిబ్రవరి 7వ తేదీన మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. వేరే లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా చెన్నై, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు తెలుగు ఈవెంట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఆ కార్యక్రమం జరగనుంది.

తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‍ లోని అన్నపూర్ణ స్టూడియోస్‍ లో జరగనుంది. తండేల్ రాజు కోసం పుష్ప రాజ్ వస్తున్నాడంటూ.. అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్ గా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత బన్నీ పాల్గొనున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే తండేల్ ప్రీరిలీజ్ ఈవెంట్‍ కు ఫ్యాన్స్ కు ఎంట్రీ లేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇండోర్ గానే ఈవెంట్ సాగనుందని సమాచారం. తండేల్ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రమే ఈవెంట్‍ కు వస్తారని తెలుస్తోంది. దీంతో అభిమానులు లేకుండానే ఈవెంట్ జరగనుందన్న మాట.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. అదే సమయంలో ఈవెంట్ లో బన్నీ కొత్త లుక్ లో కనిపించనున్నారు. సుమారు అయిదేళ్ల పాటు పుష్ప రాజ్ గా కనిపించిన ఆయన.. ఇటీవల గడ్డం ట్రిమ్ చేసి స్టైలిష్‍ గా మారారు. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక తండేల్ విషయానికి వస్తే.. నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమాపై వేరే లెవెల్ బజ్ క్రియేట్ చేశాయి. అలా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న తండేల్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.