Begin typing your search above and press return to search.

నాగ చైతన్య Vs అజిత్.. వ్వాటే ఫైట్!

ఈ రెండు సినిమాలు నటీనటుల కెరీర్‌లలో కీలకమైన మలుపుగా నిలవనున్నాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2025 6:15 AM
నాగ చైతన్య Vs అజిత్.. వ్వాటే ఫైట్!
X

తెలుగు సినీ పరిశ్రమలో కార్ రేసింగ్ విషయానికి వస్తే మొదటగా గుర్తొచ్చే పేరు నాగ చైతన్య అయితే, తమిళ చిత్ర పరిశ్రమలో అదే తరహాలో రేసింగ్ అంటే ఇష్టపడే హీరో అజిత్ కుమార్‌. ఇటీవల దుబాయ్ లో అజిత్ కార్ రేసింగ్ లో పాల్గొని తన సత్తా కూడా చాటాడు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లు ఫిబ్రవరి నెలలో బాక్సాఫీస్ రేస్‌కు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలు నటీనటుల కెరీర్‌లలో కీలకమైన మలుపుగా నిలవనున్నాయి.

అజిత్ ప్రస్తుతం తన కొత్త సినిమా విడా ముయర్చితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ట్రైలర్ గురువారం విడుదల కానుంది. ఫిబ్రవరి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మూవీలో అజిత్ తన మార్క్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. తెలుగు సంగతి పక్కన పెడితే తమిళ్ లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా అజిత్ మరోసారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉంది.

ఇక మరోవైపు నాగ చైతన్య కూడా బాక్సాఫీస్ రేస్ కు గట్టిగానే రెడీ అవుతున్నాడు తెలుగు లో అస్సలు అజిత్ సినిమా పోటీ కాదు తమిళ్ లో ఎలా ఉంటుంది అన్నదే ఇక్కడ విషయం . అత్యంత ఖరీదైన చిత్రం తండెల్తో బరిలో దిగనున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇరువురి సినిమాలు ఒకే సమయానికి రెండు భాషల్లో విడుదల కావడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాల ద్వారా అజిత్ తెలుగు మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తుండగా, నాగ చైతన్య తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అజిత్ ఇప్పటికే తమిళనాట సూపర్‌స్టార్‌గా పేరు సంపాదించగా, నాగ చైతన్య తన సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించాలని భావిస్తున్నారు. ఒక వైపు అజిత్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండగా, చైతన్య సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో పాటు దేశానికి సంబంధించిన ఒక మంచి కాన్సెప్ట్ హైలెట్ కాబోతోంది. అసలే దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2తో నేషనల్ వైడ్ గా క్రేజ్ అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాపై తమిళంలో కూడా మంచి హైప్ ఉంది.

ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్లకు చెందినవే అయినప్పటికీ, బాక్సాఫీస్ రేస్‌లో ఏది విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ రెండు సినిమాల విజయాలు ఇద్దరు హీరోల కెరీర్‌లకు బెస్ట్ మూవీస్ గా నిలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా, చైతన్య తన తమిళ డెబ్యూట్ కోసం చేసిన కృషి అభిమానులను మెప్పిస్తుందా? లేదా అజిత్ తన తెలుగు మార్కెట్‌ను విస్తరించుకుంటారా? అన్నది వేచిచూడాల్సి ఉంది.