నాగ చైతన్య ఒత్తిడిలో ఉంటే మ్యాడ్...!
ఈ సమయంలో నాగ చైతన్య అనూహ్యంగా సడెన్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు.
By: Tupaki Desk | 27 March 2025 7:49 AMనార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. 'తండేల్' స్టార్ నాగ చైతన్య మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. తండేల్ సినిమా తర్వాత నాగ చైతన్య పెద్దగా మీడియా ముందు కనిపించలేదు. భార్య శోభితతో కలిసి ఆ మధ్య విదేశాలకు వెళ్లిన నాగ చైతన్య తిరిగి వచ్చి తదుపరి సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. కొత్త సినిమా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో నాగ చైతన్య అనూహ్యంగా సడెన్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు.
మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ.. ట్రైలర్ చూశాను, మ్యాడ్ స్క్వేర్ కాదు.. మ్యాడ్ మ్యాక్స్ అన్నట్లు ఉంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నాకు ఒత్తిడి అనిపించిన ప్రతిసారి మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ ఉంటాను. ఇలాంటి కామెడీ సినిమాలు ఆరోగ్యానికి మంచిది. మూడ్ సరిగా లేని సమయంలో మ్యాడ్ లాంటి సినిమాలు చూడమని డాక్టర్లు సూచించాలి అనేది నా అభిప్రాయం. ఇలాంటి కామెడీ సినిమాలను చూడటం ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపేలా చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేస్తాయి. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయ్యారు. ప్రతి ఇంట్లోనూ వీరి పేర్లు గుర్తు పెట్టుకుంటున్నారు. దర్శకుడు కళ్యాణ్‌తో ఒక కథ గురించి కూర్చున్న సమయంలో ఆయన నరేషన్‌కి పడిపడి నవ్వాను. ఆయన ఈ సినిమాను ఎలా తీసి ఉంటాడో ఊహించగలను అన్నాడు.
ప్రేమమ్ సినిమాతో నాగవంశీతో నాగ చైతన్య జర్నీ మొదలైంది. అతడి ధైర్యమే అతడిని ఇంత దూరం తీసుకు వచ్చింది. నిర్మాత చినబాబు గారంటే నాకు చాలా ఇష్టం. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ సినిమాకు అంచనాలు ఉన్నాయి. తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఉంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను అని నాగ చైతన్య చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
బ్లాక్ టీషర్ట్ లో నాగ చైతన్య సింప్లీ సూపర్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన 'తండేల్' బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చైతూ కెరీర్‌లో మొదటి వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన సినిమా దక్కింది. దాంతో ఆయన తదుపరి సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా చైతూ తన తదుపరి సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. చైతూ కెరీర్‌లో 24వ సినిమాగా రూపొందబోతున్న ఆ సినిమాను త్వరలో ప్రారంభించబోతున్నారు. మరో వైపు నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్‌లో నటించేందుకు గాను రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.