Begin typing your search above and press return to search.

ఆమె మ‌న‌సులో చిరు..చ‌ర‌ణ్‌..కానీ ఆయ‌న మ‌రోలా!

తాజాగా ఈ సినిమా అప్ డేట్స్ ని నిర్మాత‌ల్లో ఒక‌రైన చైత‌న్య రెడ్డి రివీల్ చేసారు. ప్ర‌స్తుతం 'జై హ‌నుమాన్' ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

By:  Tupaki Desk   |   7 July 2024 3:30 PM GMT
ఆమె మ‌న‌సులో చిరు..చ‌ర‌ణ్‌..కానీ ఆయ‌న మ‌రోలా!
X

'హ‌నుమాన్' పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించ‌డంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ప్ర‌శాంత్ వ‌ర్మ 'జై హ‌నుమాన్' కూడా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇందులో న‌టించడానికి మెగాస్టార్ చిరంజీవి సంసిద్దంగా ఉన్న‌ట్లు ఇప్ప‌టికే రివీల్ చేసారు. హ‌నుమంతుడి వీర‌భ‌క్తుడిగా చిరంజీవికి పేరుంది. అదే ప్రేమ‌తో ఆ క‌థ‌లో న‌టించాల‌ని ఓపెన్ అయిపోయారు. ఆయ‌న‌తో పాటు ఛాన్స్ ఇవ్వాలేగానీ న‌టించ‌డానికి చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు. కానీ ఇంత‌వ‌ర‌కూ హీరో ఎవ‌రు? అన్న‌ది ప్ర‌శాంత్ వ‌ర్మ ఫైన‌ల్ చేయ‌లేదు.

తాజాగా ఈ సినిమా అప్ డేట్స్ ని నిర్మాత‌ల్లో ఒక‌రైన చైత‌న్య రెడ్డి రివీల్ చేసారు. ప్ర‌స్తుతం 'జై హ‌నుమాన్' ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. కానీ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయ‌లేం. ఓ మార్వెల్ సిరీస్ లా చేయాల‌నే ఆలోచ‌నతో ముందుకెళ్లాల‌నుకుంటున్నాం. ఇందులో హ‌నుమంతుడు పాత్ర ఎవ‌రు? చేస్తా ర‌న్న‌ది ఆయ‌నే నిర్ణ‌యించాలి. వ్య‌క్తిగ‌తంగా నాకైతే ఆ పాత్ర‌లో చిరంజీవిగానీ, రామ్ చ‌ర‌ణ్ గానీ చేయాల‌ని ఉంది.

కానీ హీరో విష‌యంలో నిరంజ‌న్ రెడ్డి ఆలోచ‌న మ‌రోలా ఉంది. మ‌రి ఆస్వామి త‌న క‌థ‌ని ఎవ‌రితో చేయించుకుంటాడో? చూడాలి' అని అన్నారు. మ‌రి చిరంజీవి ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్న‌ది తుదిగా నిర్ణ‌యించాల్సింది ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌- నిరంజన్ రెడ్డి అని తెలుస్తోంది. చిరు మాత్రం ఓపెన్ గానే ఆ సినిమా చేయాల‌ని ఉంద‌ని చెప్పేసారు. మ‌రి ఆయ‌న్ని కాద‌ని మ‌రో హీరోతో ముందుకెళ్తారా? ఆయ‌న‌కే ఛాన్స్ ఇస్తారా? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం చిరంజీవి పాన్ ఇండియాలో 'విశ్వంభ‌ర' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచ‌నా లున్నాయి. ఆయ‌న గ‌త పాన్ ఇండియా సినిమా 'సైరా న‌ర‌సింహారెడ్డి' కి అనుకున్నంత రీచ్ దొర‌క‌లేదు. దీంతో పాన్ ఇండియా మార్కెట్ కి చిరు ఇంకా దూరంగానే ఉన్నారు. 'విశ్వంభ‌ర' సంచ‌ల‌న‌మైతే? వాళ్లంతా చిరు వ‌ద్ద‌కు ప‌రిగెత్తి రారు.