తెరపై సమంతను చూసి చైతూ చేసిన షాకింగ్ పని!
సమంతతో నాగచైతన్య లవ్ మేకింగ్ .. రొమాంటిక్ సన్నివేశం తెరపై ప్లే అయినప్పుడు చైతన్య ఎమోషన్‌ని సదరు రెడిట్ పర్టిక్యులర్ గా గమనించాడు.
By: Tupaki Desk | 7 Jun 2024 3:56 AM GMTఅక్కినేని నాగ చైతన్య తన మాజీ భార్య సమంత రూత్ ప్రభుని తెరపై చూస్తున్న వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. చై- సమంతల చిత్రం `మనం` ప్రత్యేక విడుదల సందర్భంగా ప్రివ్యూకు చై హాజరయ్యారు. `మనం` సినిమా 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మేలో మళ్లీ విడుదల కావడంతో ఆయన అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ఒక రెడిట్ వినియోగదారు ఈ స్క్రీనింగ్ సమయంలో మొబైల్ లో చిత్రీకరించిన అనేక వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలలో రిలీజ్ చేయడం తాజా ప్రకంపనం. అయితే వీటిలో ఒక ప్రత్యేక దృశ్యం అందరినీ ఆకర్షించింది. సమంతతో నాగచైతన్య లవ్ మేకింగ్ .. రొమాంటిక్ సన్నివేశం తెరపై ప్లే అయినప్పుడు చైతన్య ఎమోషన్‌ని సదరు రెడిట్ పర్టిక్యులర్ గా గమనించాడు.
మనంలో `కనులను తాకే..` అనే పాట ప్లే అవుతుండగా చై మొహం చాటేసినట్టు అనిపించింది. అయితే ఈ సన్నివేశం పెద్ద స్క్రీన్‌పై ప్లే అయినప్పుడు అభిమానులు అతడి వైపు తిరగడంతో వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా చాలా మంది గమనించారు. సమంతతో తన సన్నివేశాలు ప్లే అవుతున్నప్పుడు కూర్చోమని వారిని కోరాడు. ఇది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానులు ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాల్లో, వాట్సాపుల్లోను వైరల్ చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు - నాగ చైతన్య 7 సంవత్సరాల డేటింగ్ తర్వాత 2017 లో వివాహం చేసుకున్నారు. వారు మొదటిసారిగా 2009లో ఏ మాయ చేసావే సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. పెళ్లయిన నాలుగో సంవత్సరంలో అంటే 2021 అక్టోబర్‌లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం చైతన్య - సమంత విడాకులు తీసుకున్నామని చట్టబద్ధంగా ఒంటరిగా ఉన్నామని ధృవీకరించారు.
ఈ ఏడాది ప్రారంభంలో సమంత, చైతన్య ఒక ఈవెంట్‌కి ఒకే తాటిపైకి వచ్చి ఆశ్చర్యపరిచారు. కానీ అది వారి పునఃకలయిక కాదు ఎప్పటికీ. సమంతా.. వరుణ్ ధావన్‌తో కలిసి `సిటాడెల్: హనీ బన్నీ`ని ప్రకటించింది. ఖుషి సినిమాతో బిజీ అయింది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తన వెబ్ సిరీస్ `ధూత` సక్సెస్ వేడుకకు హాజరయ్యారు. వారు తిరిగి కలిసే ఆలోచనలో లేరని కూడా వెల్లడైంది. సమంత తన గతం గురించి ఎప్పటికీ మాట్లాడదు. తన వృత్తిపరమైన జీవితం గురించి మాత్రమే అందరూ మాట్లాడుకోవాలని కోరుకుంటుంది. చైతన్య కూడా పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించారు.