Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప‌క్కింట‌మ్మాయే కానీ మైండ్ బ్లాక్ చేసింది!

వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ ఫ్రాక్ లో స్ట‌న్నింగ్ చైత్ర‌ మ‌తులు చెడ‌గొడుతోంది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 12:30 AM GMT
ఫోటో స్టోరి: ప‌క్కింట‌మ్మాయే కానీ మైండ్ బ్లాక్ చేసింది!
X

కొంద‌రు న‌టీమ‌ణులు న‌ట‌న‌కు జీవం పోయ‌డంలో సిద్ధ‌హ‌స్తులు. స‌హ‌జ న‌టి జ‌య‌సుధ, భానుప్రియ‌, శ్రీ‌దేవి, రాధిక కేట‌గిరీలో ఇటీవ‌లి కాలంలో కొంద‌రు యువ‌త‌రం న‌టీమ‌ణులు అరుదైన ప్ర‌తిభ‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

త‌మదైన స‌హ‌జ‌న‌ట‌న‌, అద్బుత హావ‌భావాల‌తో క‌ట్టి ప‌డేస్తున్న ఇలాంటి న‌టీమ‌ణులు ప్ర‌ముఖుల‌చే గొప్ప ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంటున్నారు. ది గ్రేట్ సాయిప‌ల్ల‌వి, తెలుగ‌మ్మాయి వైష్ణ‌వి వంటి వారికి ఇలాంటి ప్ర‌శంస‌లెన్నో ద‌క్కాయి. ఇటీవ‌ల వైష్ణ‌వి చైత‌న్య బేబి చిత్రంలో న‌ట‌న‌కు మెగాస్టార్ చిరంజీవి అంత‌టివారే ఫిదా అయిపోయి స‌హ‌జ‌న‌టి అని పొగిడేశారు.

అయితే ఇప్పుడు అదే కేట‌గిరీలో క‌న్న‌డ న‌టి కం సింగ‌ర్ చైత్ర‌.జె.ఆచార్ అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటోంది. ఇంత‌కుముందు టోబి అనే చిత్రంలో డీగ్లామ‌ర‌స్ అవ‌తార్ లో వైవిధ్య‌మైన గెట‌ప్పులు, ఆహార్యంతో మెప్పించిన ఈ బ్యూటీ ప్ర‌తిష్ఠాత్మ‌క సైమా స‌హా ప‌లు అవార్డులు అందుకుంది. అటుపైనా 'సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి'లోను త‌నదైన‌ అద్భుత న‌ట‌న‌తోనూ చైత్ర.జె.ఆచార్ ఆక‌ట్టుకుంది. త‌దుప‌రి ఈ ప్ర‌తిభావ‌ని వ‌రుసగా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది. సిద్ధార్థ్ 40 సహా పలు సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉంది. క‌న్న‌డ‌లో ఉత్త‌రాకాండ అనే చిత్రంలోను న‌టిస్తోంది.

చైత్ర ఆచార్ సోష‌ల్ మీడియాల్లోను చాలా యాక్టివ్ గా ఉంది. ఈ భామ నిరంత‌ర ఫోటోషూట్లు అభిమానుల్లోకి దూసుకెళుతున్నాయి. చూడ‌టానికి ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించినా కానీ చైత్ర‌.జె.ఆచార్ అల్ల‌రి కూడా ఇన్ స్టా ఫీడ్ లో అమితంగా ఆక‌ర్షిస్తోంది.

తాజాగా ఈ భామ‌లో అల్ట్రా స్టైలిష్ కోణాన్ని ఎలివేట్ చేస్తూ రిలీజ్ చేసిన ఫోటోషూట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ ఫ్రాక్ లో స్ట‌న్నింగ్ చైత్ర‌ మ‌తులు చెడ‌గొడుతోంది. షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ టాప్ త‌న‌లో హా* కంటెంట్ ని అద్భుతంగా ఎలివేట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ ఫోటోషూట్ త‌న ఇమేజ్ ని పెంచింద‌ని చెప్పాలి. ఈ క‌న్న‌డ న‌టి కం సింగ‌ర్ గుండెలు తీసిన బంటు అంటూ అభిమానులు హుషారుగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.