చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సమంతపై ట్రోల్స్!
నాగచైతన్య - సమంత 2021 అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్లు శోభిత ధూళిపాళ తెలిపింది.
By: Tupaki Desk | 19 Dec 2024 4:30 AM GMTఅక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా వీళ్ళ పెళ్లి జరిగింది. చైతూ - శోభిత లది లవ్ మ్యారేజ్. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కొత్త జంట, తమ ప్రేమ సంగతులను పంచుకున్నారు. దీని కారణంగా ఇప్పుడు మాజీ భార్య సమంత రూత్ ప్రభు వార్తల్లో నిలిచింది.
నాగచైతన్య, శోభిత తమ పరిచయం, ప్రేమ, పెళ్ళి గురించి తొలిసారిగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. చైతూ ఎప్పుడూ తనను తెలుగులో మాట్లాడమని ప్రోత్సహించేవారని, దాని వల్లనే తమ బంధం మరింత బలపడిందని శోభిత చెప్పింది. సినీ ఇండస్ట్రీలో విభిన్న భాషలు మాట్లాడేవారిని కలుస్తుంటాం. మాతృభాష తెలుగులో మాట్లాడేవారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వారితో త్వరగా కనెక్ట్ అవుతాను. అందుకే శోభితని తెలుగులోనే మాట్లాడాలని అడిగేవాడిని అని చైతన్య చెప్పారు.
అలానే ఇన్‌స్టాగ్రామ్ లో తాను షేర్ చేసే గ్లామర్ ఫొటోలను కాకుండా.. స్ఫూర్తిమంతమైన కోట్స్, తన అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లను మాత్రమే నాగచైతన్య లైక్ చేసేవాడని శోభిత తెలిపింది. దీంతో చైతూతో సమంత తెలుగులో మాట్లాడేది కాదా? గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడం చైతన్యకి నచ్చలేదా? ఇద్దరి మధ్య ఎక్కడ సమస్య వచ్చింది? అసలు విడాకులకు దారి తీసిన పరిస్థితులేంటి? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. కొందరు ఎప్పటిలాగే తప్పులను వెతుకుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
'ఏంమాయ చేసావే' సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన నాగచైతన్య - సమంత.. కొన్నాళ్ళపాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు తిరక్కుండానే విడిపోతున్నట్లుగా ప్రకటించారు. దానికి గల కారణాలను వెల్లడించలేదు. అయితే ఇద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం మీద నెటిజన్లు ఇప్పటికీ రెండు వర్గాలు చీలిపోయి ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. మెజారిటీ వర్గం సమంతదే తప్పన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు.
విడాకులపై చై - సామ్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పందించారు. అలా జరగడం దురదృష్టకరమని, తన జీవితంలోని ఆ దశపై తనకు ఎంతో రెస్పెక్ట్ ఉందని చైతన్య చెప్పారు. విడిపోవడం తనను ఎంతో బాధ పెట్టిందని సమంత చెప్పింది. ఏదొక సందర్భంలో పరోక్షంగా తన విడాకుల మీద పోస్టులు పెడుతూ వచ్చింది. ఈ మధ్యనే తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్ట్స్ మీద కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక చైతూ - శోభిత నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి సామ్ కు సంబంధం లేకుండానే వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి చర్చలోకి వచ్చింది.
నాగచైతన్య - సమంత 2021 అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్లు శోభిత ధూళిపాళ తెలిపింది. 2018లో 'గూఢచారి' సినిమా సక్సెస్ అయిన తర్వాత మొదటిసారి అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లానని చెప్పింది. 2022 ఏప్రిల్ లో నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అయ్యానని, ఆయన ఫాలో బ్యాక్ చేశాడని శోభిత తెలిపింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మాటలు కలిసాయని, ముంబయిలోని ఓ కేఫ్‌లో ఫస్ట్ టైం కలుసుకున్నామని, ఆ తర్వాత ఇంకోసారి కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లినట్లు వెల్లడించింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు శోభిత చెప్పుకొచ్చింది.