Begin typing your search above and press return to search.

చైతూ ఫోకస్ అంతా ఆ రెండింటిపైనే

రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో తయారు చేసుకున్న కథని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:32 AM GMT
చైతూ ఫోకస్ అంతా ఆ రెండింటిపైనే
X

గత ఏడాది థాంక్యూతో డిజాస్టర్ కొట్టిన నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ మూవీతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం బలంగా హిట్ కొట్టాలని కసితో చైతన్య మూవీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ తో మూవీ చేయబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో తయారు చేసుకున్న కథని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. చందూ మొండేటి కూడా ఈ మూవీ కోసం చాలా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. చైతూ, చందూ ఇద్దరు కూడా ఉత్తరాంద్ర వెళ్లి అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి చేపల వేటకి వెళ్లి పాకిస్తాన్ లో చిక్కుకున్న మత్స్యకారుల కథగా ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు.

నాగ చైతన్య ఈ చిత్రంపై చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. దీని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం చైతన్య ఈ రెండు సినిమాల మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టాడంట. కొత్త కథలు కూడా వినే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీస్ విషయంలో నాగ చైతన్య ఆలోచించనున్నాడంట.

త్వరలో చందూ మొండేటి దర్శకత్వంలో చేయనున్న మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతన్యకి జోడీగా నటిస్తోంది. లవ్ స్టొరీ తర్వాత మరోసారి వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పెయిర్ గా కనిపించబోతున్నారు. దర్శకుడు చందూ కూడా ప్రేమమ్ రీమేక్ తర్వాత చైతూతో చేస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం. అలాగే గీతా ఆర్ట్స్ 2లో వస్తోన్న మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం ఇదే.

ఇప్పటి వరకు మినిమం రేంజ్ మూవీస్ చేసిన బన్నీ వాస్ మొదటి సారి 50 కోట్లకి పైగా బడ్జెట్ ఒక కథపైన పెట్టబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి చేస్తోన్న సినిమా ఇది కావడం మరో ఇంటరెస్టింగ్ విషయంగా ఉంది.