అమ్మతో అప్యాయంగా చైతన్య ఇలా!
యువ సామ్రాట్ నాగచైతన్యతో మామ్ తో ఎంత ప్రేమగా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 12 May 2024 11:36 AM GMTయువ సామ్రాట్ నాగచైతన్యతో మామ్ తో ఎంత ప్రేమగా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. కానీ అమ్మతో కలిసి దిగిన ఫోటోలు మాత్రం నెట్టింట రేర్ గా వైరల్ అవుతుంటాయి. మామ్ సినిమా ఫీల్డ్ తో సంబంధం లేని వ్యక్తి కావడంతో! మీడియా లో కూడా పెద్దగా కనిపించరు. వృత్తి పరంగా ఆమె ఎంతో బిజీగా ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఈవెంట్లు ఉంటే హాజరవుతారు. కానీ తనయుడిపై మాత్రం ఎప్పుడూ ఓ కన్ను ఉంటుంది. కుమారుడు ఇండస్ట్రీలో ఎలా రాణిస్తున్నాడు? వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు.
తాజాగా నేడు మదర్స్ డేసందర్భంగా చైతన్య అమ్మతో కలిసి దిగిన ఓఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. ఓ హాటల్ లో ఇద్దరు మదర్స్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో నాగచైతన్య తల్లిని చూడొచ్చు. ఆమె ఎంతో మోడ్రన్ గా కనిపిస్తున్నారు. తల్లి భుజంపై చైతన్య చేయి వేయగా... తనయుడి నడుముపై తల్లి చేయి వేసి ఇద్దరు ఎంతో ఆప్యాయంగా కెమెరాకి ఫోజు ఇచ్చారు. అమ్మతో చైతన్య కేక్ కట్ చేయించి విషెస్ తెలియజేసాడు. చైతన్య అభిమానులు సోషల్ మీడియా లో ఉమెన్స్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
ఇక చైతన్య కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పుల్ స్వింగ్ లోదూసుకుపోతున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న `తండేల్` తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఉత్తరాంధ్ర మత్సకారుల జీవితాల్లో చోటుచేసుకున్నకొన్ని వాస్తవ సంఘటనలు అధారంగా ఈచిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
`కార్తీకేయ-2` తర్వాత చందు తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియాలో మరోసారి మోత మోగించడం ఖాయమనే అభిమానులు అంచనా వేస్తున్నారు. చైతన్య మాస్ లుక్... పాకిస్తాన్ జైల్లో పవర్ పుల్ తెలుగు కుర్రాడి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇందులో చైతన్యకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇదో అద్భుతమైన ప్రేమ కథా చిత్రం కూడా.