Begin typing your search above and press return to search.

ప్రభాస్ డిజాస్టర్ సినిమా.. అంత రిస్క్ ఎందుకు?

గత కొన్నేళ్ల నుంచి రీరిలీజ్ ట్రెండ్ తెలుగునాట గట్టిగానే నడుస్తోంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది

By:  Tupaki Desk   |   13 May 2024 4:08 AM GMT
ప్రభాస్ డిజాస్టర్ సినిమా.. అంత రిస్క్ ఎందుకు?
X

గత కొన్నేళ్ల నుంచి రీరిలీజ్ ట్రెండ్ తెలుగునాట గట్టిగానే నడుస్తోంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది. తమిళంలో కూడా స్టార్ హీరోల పాత సినిమాలని రీరిలీజ్ చేస్తున్నారు. గత నెల ఇళయదళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిలి తమిళనాట రీరిలీజ్ అయ్యి ఏకంగా 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన చిత్రాలలో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్.

ఈ రికార్డ్ ని ఏ మూవీ కూడా బ్రేక్ చేయకపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రీరిలీజ్ ట్రెండ్ కి ఆదరణ తగ్గుతూ వస్తోంది. దీంతో సినిమాల రీరిలీజ్ కి ముందు ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, పబ్లిక్ లో ఉన్న బజ్ అంచనా వేసుకొని థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి బజ్ లేదనుకుంటే మాత్రం రీరిలీజ్ ఎనౌన్స్ చేసి వాయిదా వేసేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో రీరిలీజ్ ఎనౌన్స్ అయ్యి ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో డిజాస్టర్ అయినప్పటికి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న సినిమా అంటే వెంటనే చక్రం అని చెబుతారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూనే మరోవైపు మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు. జీవితం గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాన్ని కృష్ణవంశీ చక్రం సినిమా ద్వారా చెప్పారు.

ఈ మూవీలో జగమంత కుటుంబం నాది అనే సాంగ్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ మోటివేషనల్ పాటలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే హై రేంజ్ లో మాస్ ఇమేజ్ వచ్చిన తరువాత ప్రభాస్ చనిపోయే పాత్రలో నటించడం ఆడియెన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక పోస్టర్ తో చక్రం మూవీని అతి త్వరలో రీరిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. ప్రభాస్ వర్షం మూవీ గతంలో రీరిలీజ్ అయిన ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు.

అలాంటిది అతని డిజాస్టర్ మూవీ ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేసే అవకాశం ఉందా అంటే కష్టమనే మాట వినిపిస్తోంది. మరి చక్రం రీరిలీజ్ సాధ్యం అవుతుందా అనేది అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేంత వరకు చెప్పలేమని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ రిలీజ్ చేసిన పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చని ట్రేడ్ పండితుల అంచనా.