మెగాస్టార్ తో 157..అనిల్ ముందు బిగ్ ఛాలెంజ్!
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 March 2025 1:35 PM ISTమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. చిరంజీవి లో కామెడీ టైమింగ్ ని బేస్ చేసుకుని అనిల్ స్టోరీ సిద్దం చేసాడు. ఈ స్టోరీకి చిరంజీవి ఎంతగా కనెక్ట్ అయ్యారు? అన్నది ఇప్పటికే రివీల్ చేసారు. చాలా కాలం తర్వాత గొప్ప కామెడీ చిత్రం చేస్తున్నట్లు రివీల్ చేసారు. సమ్మర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అనిల్ ప్రధమార్ధం పై వర్క్ చేస్తున్నాడు. రెండు ఫన్ సీక్వెన్సెస్ ఫైనల్ అయినట్లు తెలిపారు. స్క్రిప్ట్ సహా సన్నివేశాలన్నీ తాము ఊహించిన దానికంటే గొప్పగా వస్తున్నాయని అనిల్ తెలిపాడు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇందులో వాస్తవం ఎంతో తేలాలి. అయితే ఈ సినిమాతో అనిల్ ముందు బిగ్ ఛాలెంజ్ కూడా ఉంది.
ఇప్పటి వరకూ అనిల్ సినిమాలు ఫెయిల్ అవ్వలేదు. చేసిన సినిమాలన్నీ మంచి ఫలితాలు సాధించాయి. 'పటాస్' నుంచి మొన్నటి 'సంక్రాంతికి వస్తున్నాం' వరకూ అన్ని మంచి వసూళ్లు సాధించిన చిత్రాలే. సంక్రాంతి సినిమా అయితే ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ రకంగా వెంకటేష్ కి తొలి 100 కోట్ల సినిమాతో పాటు 300 కోట్ల క్లబ్ చేర్చిన చిత్రంగానూ రికార్డు సృష్టించింది.
ఆ సినిమానే అంత పెద్ద విజయం సాధించిందంటే? మెగాస్టార్ లాంటి స్టార్ హీరో అయితే 157 రేంజ్ ఏంటి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డు నమోదు చేయాలి. మెగా అభిమానుల్లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. అనిల్ స్క్రిప్ట్....మెగా ఇమేజ్ తో పెద్ద విషయం కాదన్నది అభిమానుల మాట.