రోషన్ ‘ఛాంపియన్’ గ్లింప్స్.. కొత్తగా ఉందే..
రోషన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఛాంపియన్’ గ్లింప్స్‌ను విడుదల చేయగా, ఇది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
By: Tupaki Desk | 13 March 2025 1:25 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో రోషన్ తన మూడో చిత్రంగా ‘ఛాంపియన్’ అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఛాంపియన్’ గ్లింప్స్‌ను విడుదల చేయగా, ఇది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
గ్లింప్స్‌లో బాల్ తన్నే షాట్‌తోనే కథలోని ప్రధాన విషయాన్ని హింట్ ఇచ్చారు. మట్టిలో తడిసిన రక్తపు కాళ్లతో బాల్‌ను తన్నుతున్న హీరో.. ఆ క్షణంలోనే ఒక విప్లవం మొదలైనట్టు అనిపిస్తోంది. హార్స్ రైడింగ్, అధికారుల బ్యాక్‌డ్రాప్.. ఇది కేవలం ఫుట్‌బాల్ గేమ్ మాత్రమే కాదని, పాత కాలం నాటి ఏదో గొప్ప విషయాన్ని హైలెట్ చేయనున్నట్లు అర్ధమవుతుంది.
కొంత మంది గుఱ్ఱస్వారులు ముందుకు దూసుకెళ్తున్న సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ షాట్ చూస్తుంటే, బ్రిటిష్ కాలం నాటి కథ అనిపిస్తోంది. రోషన్ లుక్ రఫ్ అండ్ టఫ్‌గా ఉండగా, అతని హావభావాలు గట్టిగా పోరాడే ఒక ఫైటర్‌ను గుర్తు చేస్తున్నాయి. టీజర్‌లో మరో హైలైట్ హీరో దూకుడు.. కాలితో తన్నుతూ వెళ్లే స్టంట్ ఒక పవర్‌ఫుల్ సీన్‌లా నిలిచింది. రొషన్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఇందులో కనిపిస్తున్నాడు.
అతని హావభావాలు మ్యూజిక్, విజువల్స్‌కి పూర్తిగా సరిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం ఈ గ్లింప్స్‌లో మరో ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనం ఎమోషన్‌ను మలచడానికి బాగా ఉపయోగపడేలా ఉంది. విజువల్స్‌కు తగ్గట్టుగా సౌండ్ డిజైన్, గ్రాండియర్ లుక్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదే విధంగా ఫుల్ లెంగ్త్ టీజర్ కూడా భారీగా ఉంటుందని ఈ చిన్న వీడియో ద్వారా అర్థమవుతోంది. ఫుట్‌బాల్ మాత్రమే కాదు, ఈ గేమ్ వెనుక ఉన్న కథ, హీరో పాత్ర, దేశభక్తితో కూడిన పోరాటం ఎలా ఉంటుందనేది త్వరలో క్లారిటీ రానుంది. మొత్తానికి ‘ఛాంపియన్’ గ్లింప్స్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తిని కలిగించిందనే చెప్పాలి.