అయ్యో.. తెలుగమ్మాయికి ఏమైంది?
అయితే చాందిని రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 5 Nov 2024 9:04 AM GMTతెలుగమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారారు. తొలి సినిమాలో తన అందం, అభినయంతో వేరే లెవెల్ లో అలరించారు. కరోనా టైమ్ లో కలర్ ఫోటో మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
సరైన హిట్ కొట్టేందుకు పట్టుదలతో సినిమాలు చేస్తున్నారు చాందిని చౌదరి. 2024లో ఇప్పటికే మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గామి, ఏవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలతో సందడి చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ప్రయోగాత్మక మూవీ గామితో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మిగతా రెండు చిత్రాలతో మాత్రం అనుకున్న స్థాయిలో హిట్స్ సాధించలేకపోయారు.
అయితే చాందిని రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకు తన గాయమే కారణమని చెప్పారు. తాను కొన్నాళ్ల క్రితం గాయపడినట్లు వెల్లడించారు చాందిని. ఆ గాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ రావడంతో దాని తీవ్రత పెరిగినట్లుగా తెలిపారు. దీంతో ఇప్పుడు చాలా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.
"గత కొన్నాళ్లుగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు. కొన్ని నెలల క్రితం నాకు చిన్న గాయమైంది. అయితే దాని తీవ్రతను నేను అర్థం చేసుకోలేకపోయాను. షూటింగ్స్ కు వెళ్లాను. దీంతో ఆ గాయం తీవ్రత పెరిగింది. ఇప్పుడు షూటింగ్ లకు వెళ్తుంటే ఆ గాయం మరింతగా బాధిస్తోంది. అందుకే ఆరోగ్యం కుదుటపడిన తరువాత సోషల్ మీడియాకు తిరిగి వస్తాను" అంటూ ఇన్ స్టా స్టోరీలో చాందిని రాసుకొచ్చారు.
ప్రస్తుతం చాందిని చేతిలో NBK 109 ప్రాజెక్టు ఉంది. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రంలో చాందిని స్పెషల్ రోల్ పోషిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాందిని గాయపడినట్లు చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టేక్ కేర్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.