Begin typing your search above and press return to search.

పాపం చాందిని.. రూట్ మారిస్తే కానీ..!

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అన్న మాట ఎప్పటి నుంచో వినపడుతుంది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 8:30 AM GMT
పాపం చాందిని.. రూట్ మారిస్తే కానీ..!
X

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అన్న మాట ఎప్పటి నుంచో వినపడుతుంది. ఐతే ప్రస్తుతం ట్రెండ్ మారింది ఇప్పుడు మన వాళ్లకు కూడా అవకాశాలు వస్తున్నాయి. కొద్దిగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఛాన్స్ అన్నట్టుగా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ మెటీరియల్ అయితే మాత్రం కచ్చితంగా వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఐతే ఛాన్సులు ఇస్తున్నా కూడా కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది మాత్రం వాళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. తెలుగు అమ్మాయిగా హీరోయిన్ గా నటించిన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది వైష్ణవి చైతన్య.


బేబీ సినిమాతో అమ్మడు బ్లాక్ బస్టర్ అందుకోగా ఆ తర్వాత లక్కీ ఆఫర్లు అందుకుంటుంది. ఐతే ఇదే క్రమంలో మరో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి మాత్రం తన రూటే సెపరేటు అనేస్తుంది. అంతకుముందు షార్ట్ ఫిలింస్ లో హీరోయిన్ గా నటించిన చాందిని చౌదరి కేటుగాడు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కుందనపు బొమ్మలో కూడా నటించింది.

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్న చాందిని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కాకుండా డిఫరెంట్ సినిమాల్లో నటిస్తుంది. ఈ ఇయర్ గామి అంటూ వచ్చి సక్సెస్ అందుకున్న చాందిని చౌదరి లేటెస్ట్ గా యేవం, మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ రెండు సినిమాలతో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ రెండు సినిమాల్లో మ్యూజిక్ షాప్ మూర్తి ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ వచ్చినా సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేదు.

రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా కూడా రెండిటిలో ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ అందుకోలేదు. సినిమాల విషయంలో చాందిని కమిట్మెంట్ బాగానే ఉన్నా అమ్మడు ఇవి చేస్తూనే కమర్షియల్ సినిమాలు కూడా చేస్తే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు ఆడియన్స్. రూట్ మారిస్తేనే కానీ అమ్మడికి లక్ కలిసి వచ్చేలా లేదని చెప్పొచ్చు. మరి చాందిని చౌదరి ఆడియన్స్ రిక్వెస్ట్ ని అర్థం చేసుకుంటుందా లేదా తన పంథా తనదే అని వెళ్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు సినిమాను చేస్తున్న చాందిని అది కూడా వెరైటీ కథతో వస్తుందని తెలుస్తుంది.