Begin typing your search above and press return to search.

కలగనడానికి వయసుతో సంబంధం లేదు.. నువ్వు హీరోయిన్ ఏంటని నవ్వారు..!

అజయ్ ఘోష్ లీడ్ రోల్ లో చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా శివ పాలడుగు డైరెక్షన్ లో వస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి.

By:  Tupaki Desk   |   13 Jun 2024 4:06 AM GMT
కలగనడానికి వయసుతో సంబంధం లేదు.. నువ్వు హీరోయిన్ ఏంటని నవ్వారు..!
X

అజయ్ ఘోష్ లీడ్ రోల్ లో చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా శివ పాలడుగు డైరెక్షన్ లో వస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. జూన్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి అతిథులుగా బేబీ దర్శకుడు సాయి రాజేష్, యువ నిర్మాత ధీరజ్ లు అటెండ్ అయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ తన స్పీచ్ తో అదరగొట్టగా అదే రేంజ్ లో హీరోయిన్ చాందిని చౌదరి స్పీచ్ అలరించింది.

చాందిని చౌదరి మాట్లాడుతూ.. మనిషి అన్నాక కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటిలో కొన్ని చిన్నప్పుడే తెలుసుకుంటాం.. కొన్ని పెరుగుతూ నేర్చుకుంటున్న విషయాలను బట్టి తెలుసుకుంటాం. ఐతే కొన్ని మన రియాలిటీకి దగ్గరగా ఉంటాయి సాధించగలం అనుకుంటాం కానీ కొన్ని దూరంగా ఉంటాయి. ఆ టైంలో కొందరు ఎగతాళి చేస్తారు వాటిని ఓవర్కం చేసుకున్నా సరే ఎవరో ఒకరు ఇది అవసరమా అంటూ చెబుతుంటారు. అలాంటి బేస్ పాయింట్ మీద చేసిన సినిమానే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి.

కొన్నిటిని కొందరు వయసు అయిపోతుంది సాధించలేరు అని అనుకుంటాం కదా.. ఈ టైం కల్లా ఇది డ్రాగ్ చేయకపోతే వేరే దానికి వెళ్లాలి అన్న థాట్ ఉంటుంది ఆ టైం లో ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కొన్నిచోట్ల కాంప్రమైజ్ అయిపోతాం.. ఇలాంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు చాందిని చౌదరి. కలగనడానికి వయసుతో సంబంధం లేదు అనేది ఈ సినిమాతో చెప్పదలచుకున్నామని చెప్పారు.

తన లైఫ్ లో కూడా 10 ఏళ్ల ముందు నువ్వు హీరోయిన్ ఏంటి అని అన్నారు. కానీ మనం పెట్టుకున్న గోల్స్ స్ట్రాంగ్ గా ఉంటే తప్పకుండా రీచ్ అవుతాం. చిన్న సినిమాలే కావొచ్చు కానీ ఇది నాకు చాలా పెద్దది. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం కంటే సంతోషం ఏముంటుంది. మ్యూజిక్ షాప్ మూర్తి లాంటి హృదయానికి దగ్గరయ్యే సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసి మూర్తి చేశాడు కదా అని 100 మందిలో ఒక్కరు ట్రై చేసినా మేము సక్సెస్ అయినట్టే. మంచి కాన్సెప్ట్ సినిమా అందరు తప్పకుండా చూడండి అని చాందిని చౌదరి అన్నారు.