చందు మొండేటి పేరు మార్చుకుంటానంటూ సవాల్!
యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో `తండేల్` తెరకెక్కిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Feb 2025 4:52 PM GMTయువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో `తండేల్` తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిత్రం పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య 7ప రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా సినిమా ఓ సంచలనంలా మారింది. శ్రీకాకుళం జిల్లా మత్సకారుల జీవితంలో చోటు చేసుకున్న వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది.
ఇదే కథలో అద్భుతమైన ప్రేమకథని చెప్పబోతున్నాడు. నాగచైతన్య కెరీర్ లో మరో క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలిపోతుం దంటున్నారు. ఇప్పటికే బుజ్జి తల్లి నెట్టింట ట్రెండిగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి నేచురల్ పెర్పార్మెన్స్ తో సినిమాకి ఓ హై క్రియేట్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకులకు సవాల్ విసిరాడు. `తండేల్` కు రిపీటెడ్ లవర్స్ లేకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేసాడు.
దీన్ని బట్టి చందు సినిమాలో లవ్ స్టోరీపై ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో? అర్దమవుతుంది. చందు మొండేటి తొలి స్ట్రెయిట్ లవ్ స్టోరీ చిత్రం ఇదే. కెరీర్ ఆరంభంలో సస్పెన్స్ థ్రిల్లర్ `కార్తికేయ` తర్వాత `ప్రేమమ్` అనే లవ్ స్టోరీ తెరకెక్కించాడు. అది మంచి హిట్ అయింది. అయితే `ప్రేమమ్` మాలీవుడ్ సినిమా రీమేక్. ఆ తర్వాత తన మార్క్ చిత్రాలతో ప్రేక్షుకల్ని అలరించాడు. `కార్తికేయ2` తో పాన్ ఇండియాలో సంచలనం అయ్యాడు.
ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయకుండా `తండేల్` పైనే వర్క్ చేసి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సినిమాలో లవ్ ట్రాక్స్ హైలైట్ అవుతాయని, యాక్షన్ కంటెంట్ లో అంతకు మించిన గొప్ప లవ్ స్టోరీ ఉందని ప్రాజెక్ట్ మొదలు పెట్టిన నాటి నుంచి చందు బలంగా చెబుతోన్న మాట. కాపీ చేతికి వచ్చిన తర్వాత అతడిలో మరింత నమ్మకంగా పెరిగింది. అందుకే పేరు మార్చుకుంటానంటూ కొత్తగా సవాల్ విసిరాడు.