తండేల్ డైరెక్టర్.. మరో కిక్కిచ్చే కాన్సెప్ట్!
అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ కూడా ప్రేక్షకులలో అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేస్తున్నాయి
By: Tupaki Desk | 1 May 2024 12:30 PM GMTకార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు చందు మొండేటి ఇప్పుడు అంతకుమించి అనేలా తండేల్ సినిమాను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ కూడా ప్రేక్షకులలో అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేస్తున్నాయి. ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు చందు మొండేటి పిరియాడిక్ జానర్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది. గతంలో కూడా ఈ దర్శకుడు కొంతమంది హీరోలను సంప్రదించినట్లుగా పలు రకాల వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా ఒక స్టార్ తో సినిమా ఆ చేయబోతున్నట్లు కూడా మళ్ళీ కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. చందు రాసుకున్న ఆ పిరియాడిక్ కథను బిగ్ స్టార్ తోనే చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ కథ గురించి నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసుకి కూడా తెలుసు. స్టోరీ కాన్సెప్ట్ సూపర్బ్ గా ఉందని, ఎన్టీఆర్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ లాంటి హై రేంజ్ హీరోలతో చేయాలని ఆలోచిస్తున్నారు. అంతే కాని ఇంకా ఏ హీరోతో అన్నది మాత్రం ఫైనల్ కాలేదు.
మొత్తానికి తండేల్ అనంతరం చందు నుంచి రాబోయే సినిమాలు అంతకుమించి అనేలా ఉంటాయని తెలుస్తోంది. చందు కాన్ఫిడెన్స్ చూస్తుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా వరల్డ్ లో అగ్ర దర్శకుల్లో ఒకడిగా నిలుస్తారు అని చెప్పవచ్చు. ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో అతని పేరు నార్త్ లో కూడా ట్రెండ్ అవుతోంది.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమా పడితే మాత్రం మామూలుగా ఉండదు. తండేల్ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఆ సినిమా నాన్ థియేట్రికల్ గానే సాలీడ్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ బిజినెస్ పరంగా కూడా అతని రేంజ్ ను మరింత పెంచేలా ఉంది. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.