అనిల్ జోకులకు కడుపుబ్బా నవ్విన చంద్రబాబు
ఈ పార్టీలో నారా చంద్రబాబు నాయుడిని అనిల్ రావిపూడి భార్యాభర్తలపై జోక్స్ వేసి కడుపుబ్బా నవ్వించారు.
By: Tupaki Desk | 4 Feb 2025 9:37 AM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెద్దగా ఫీలింగ్స్ ఉండవనే మాట చాలా కాలంగా అందరూ అంటూ ఉంటారు. అతనికి ఎమోషన్స్ కూడా చాలా లిమిట్ గా ఉంటాయని, ఉన్నా వాటిని బయటకు చూపరని అంటారు. దానికి తగ్గట్టే చంద్రబాబు బహిరంగంగా ఎప్పుడూ పెద్దగా నవ్వడం, బాధ పడటం లాంటివి చేయలేదు.
కానీ రీసెంట్ గా నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు గానూ ఆయన చెల్లి బాలయ్యకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటూ పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో నారా చంద్రబాబు నాయుడిని అనిల్ రావిపూడి భార్యాభర్తలపై జోక్స్ వేసి కడుపుబ్బా నవ్వించారు.
అనిల్ తన స్పీచ్ లో భాగంగా ఇవాళ మూడు అద్భుతాలు చూశానని, అందులో మొదటిది నారా లోకేష్ తన భార్య ముందే అమ్మ చేతి వంట బావుంటుందని చెప్పడం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప భార్యల ముందు అలా నిజాలు చెప్పలేరని అన్నాడు. ఇక రెండోది యాంకర్ బాలయ్య బాబుని వసుంధరమ్మ ముందు ఐ లవ్ యూ చెప్పమని అడిగితే బాలయ్య యాంకర్ ను ఎవరికి చెప్పాలని అడిగారని, అలా కూడా ఎవరూ అనలేరని ఏం గుండె బాబూ మీది అని బాలయ్యను అన్నారు.
ఇక మూడో విషయంగా భువనమ్మ చంద్రబాబు గారిని స్టేజ్ పైకి వచ్చి మాట్లాడమని చెప్పగానే ఆయన చాలా కామన్ మ్యాన్ లాగా వచ్చి ఆమె పక్కన నిల్చున్నారు. ఆయన పైకి రాగానే ఇది పొలిటికల్ మీటింగ్ కాదని 5 నిమిషాలే మాట్లాడాలని టైమ్ లిమిట్ కూడా పెట్టి మాట్లాడమంటే ఆయన సైలెంట్ గా భువనమ్మ మాటల్ని విన్నారని, ఎంత సీఎం అయినా భార్య దగ్గర భర్తేననే కోణంలో అనిల్ చెప్పడంతో చంద్రబాబు ఎంతో ఆనందంగా వింటూ నవ్వుతూ ఎంజాయ్ చేశారు.
అనిల్ మాట్లాడిన ఆ వీడియోలో చంద్రబాబు అంత ఆనందంగా ఉండటాన్ని చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. బాలయ్యకు చేసిన ఈ సన్మాన సభలో అందరూ బాగానే ఎంజాయ్ చేశారని ఒక్కొక్కటిగా బయటికొస్తున్న ఫుటేజ్‌ను చూస్తుంటే అర్థమవుతోంది.