Begin typing your search above and press return to search.

తార‌క్ విషెస్ పై చంద్ర‌బాబు రియాక్ష‌న్!

దీనిపై చంద్ర‌బాబు కూడా స్పందించారు. `థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ‌` అటూ తార‌క్ కి రిప్లై ఇచ్చారు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 5:55 AM GMT
తార‌క్ విషెస్ పై చంద్ర‌బాబు రియాక్ష‌న్!
X

నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ ముఖ్యంత్రి కాబోతున్న సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌ల‌తో మోతెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌లితాలొచ్చి మూడు రోజులు అవుతున్నా? ఇంకా సోష‌ల్ మీడియాలో విషెస్ వెల్లువ కొన‌సాగుతూనే ఉంది. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు అందుకుంటున్నారు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబుకి శుభాకాంక్ష‌లు చెప్పారు.

దీనిపై చంద్ర‌బాబు కూడా స్పందించారు. `థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ‌` అటూ తార‌క్ కి రిప్లై ఇచ్చారు. అలాగే బాబు కి శుభాకాంక్ష‌లు చెప్పిన మిగ‌తా సెల‌బ్రిటీలు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ ఇత‌రులంద‌రికీ కూడా బాబు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసారు. ముఖ్య‌మంత్రి గా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారానికి సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టు భారీ ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే డిజైనింగ్ కి సంబంధించి ప‌నుల‌న్నీ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కి అప్ప‌గించారు.

గ‌తంలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రూపొందిన గోదావ‌రి పుష్క‌రాలు గ్రాండ్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో మ‌రోసారి అవ‌కాశం బోయ‌పాటికి క‌ల్పించారు. ఈసారి కూడా అంత‌కు మించి మోతెక్కించాల‌ని బోయ పాటి గ‌ట్టిగానే ప‌ని చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖ‌ల్ని ఆహ్వానించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా సెల‌బ్రిటీలంతా ప్ర‌మాణ‌స్వీకారం రోజున భారీ ఎత్తున త‌ర‌లి రావ‌డానికి అవ‌కాశం ఉందం టున్నారు.

సినీ దిగ్గ‌జాల‌తో పాటు జ‌న‌సేన త‌రుపున ప్ర‌చారం చేసిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు, టీవీ ఆర్టిస్టుల‌ను కూడా పిల‌వాల‌ని భావిస్తున్నారుట‌. అలాగే కోలీవుడ్ హీరో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ని కూడా ప్ర‌త్యేంకంగా ఆహ్వానించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఎవ‌రెవ‌రికి ఆహ్వానం అందుతుందో చూడాలి. ఇండ‌స్ట్రీ నుంచి ఎప్పుడూ చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తుంటుంది. ప‌రిశ్ర‌మ ప‌ట్ల ఆయ‌న అంతే చొరవ చూపుతుంటారు.