చంద్రబోస్ 'వైల్డ్‌ఫైర్' పిక్.. 'పుష్ప 2' పుకార్లకు చెక్ పెట్టినట్లేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ బండ్రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప 2: ది రూల్''
By: Tupaki Desk | 18 Nov 2024 1:24 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ బండ్రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప 2: ది రూల్''. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. పాట్నా వేదికగా తెలుగు, హిందీ భాషల్లో బన్నీ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్.. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లిరిసిస్ట్ చంద్రబోస్ తాజాగా ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ప్రచారంలో ఉన్న ఎన్నో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.
''వైల్డ్‌ఫైర్'' అంటూ సోమవారం సాయంత్రం చంద్రబోస్ రెండు ఫోటోలను పోస్ట్ చేసారు. ఒక దాంట్లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్ కలిసి ఉన్నారు. మరొక ఫొటోలో వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీతో పాటుగా నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు కూడా ఉన్నారు. ఇందులో వీరంతా నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ, వాళ్ళ ఫేస్ లలో చాలా అలసట కనిపిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, అందరూ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 'పుష్ప 2' మ్యూజిక్ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా ఇతర సంగీత దర్శకులతో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించడంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. డీఎస్పీ బీజీఎమ్ బన్నీ, సుకుమార్ లకు నచ్చలేదని.. దేవి సినిమా మీద కంటే కాన్సర్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారని, ఈ క్రమంలో దర్శక హీరోలతో దేవిశ్రీకి విబేధాలు వచ్చాయని, అందుకే ఆయన్ను పక్కన పెట్టి వేరే వాళ్లకు వర్క్ అప్పగించారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చంద్రబోస్ రెండు ఫొటోలతో వీటన్నిటికీ చెక్ పెట్టారు. బన్నీ, సుక్కూలతో దేవిశ్రీ రిలేషన్ బాగానే ఉందని చెప్పకనే చెప్పారు.
'పుష్ప 2' ట్రైలర్ లో వినిపించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిందే అని సౌండ్ డిజైనర్ రకూల్ పోకుట్టి పోస్ట్ చేసిన ఫోటోతో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చంద్రబోస్ పంచుకున్న ఫొటోలతో ఈ సినిమా మ్యూజిక్ విషయంలో డీఎస్పీ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తున్నాడనేది తెలుస్తోంది. కాకపోతే రిలీజ్ డేట్ దగ్గర పడటమో లేదా మరేదైనా ఇతర కారణాల చేతనో సినిమాలోని కొన్ని పోర్షన్స్ కు మాత్రం ఎస్. థమన్, అజనీష్ లోక్ నాథ్, సామ్ సీఎస్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో బీజీఎమ్ చేయిస్తున్నారని స్పష్టమవుతోంది.
ఇక చంద్రబోస్ విషయానికొస్తే.. ఎన్నో పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించి తెలుగు సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని రాసుకున్నారు. పాట నేపథ్యానికి తగ్గట్టుగా, అందరూ పాడుకునే విధంగా అర్థవంతమైన సరళమైన లిరిక్స్ రాయడం చంద్రబోస్ స్పెషాలిటీ. మట్టి పదాలతో 'నాటు నాటు' పాట రాసి, తెలుగు సాహిత్యాన్ని ఆస్కార్ అవార్డ్స్ లాంటి అంతర్జాతీయ వేదికల మీదకు తీసుకెళ్లారు. ఎంఎం కీరవాణితో కలిసి సగర్వంగా అకాడమీ పురష్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు గీత రచయిత 'పుష్ప 2: ది రూల్'' పాటలతో సంగీత సాహిత్య ప్రియులను అలరించడానికి సిద్ధమయ్యారు.
'పుష్ప: ది రైజ్' సినిమాలో పాటలన్నీ ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్స్ అన్నీ గీత రచయిత చంద్రబోస్ సింగిల్ కార్డులో రాసారు. 'పుష్ప 2' చిత్రంలోని పాటలను కూడా చంద్రబోసే సాహిత్యం సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన 'పుష్ప పుష్పరాజ్' టైటిల్ సాంగ్, 'సూసేకి' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సందర్భానుసారంగా ఈ సాంగ్స్ కి ఆయన రాసిన లిరిక్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ట్యూన్స్ కి తగ్గట్టుగా.. గమ్మతైన పదాలతో మళ్లీ మళ్లీ వినాలపించేట్టుగా చంద్రబోస్ లిరిక్స్ రాశారు. మిగతా పాటలకు కూడా మంచి సాహిత్యం అందించినట్లుగా ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'కిస్సిక్' పాటకు ఆయన రాసిన లిరిక్స్.. 'ఊ అంటావా మావా' రేంజ్ లో ఊపేస్తాయని అంటున్నారు.