బోస్ సొంత ఊరిలో ఆస్కార్ సెలబ్రేషన్.. కేన్స్‌కి?
బోస్ దీని గురించి ప్రస్థావిస్తూ.. ''ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊళ్లో సంబరాలు జరిగితే ఆ సంబరాలకు వెళ్లాను. అక్కడ అంతా బాగా పండగలా సాగింది. అయితే ఆ విజువల్స్ అన్నిటినీ డాక్యుమెంటైజ్ చేసారు.
By: Tupaki Desk | 10 Dec 2023 6:33 AM GMT2023 టాలీవుడ్ కి ఎంతో శుభకరమైన సంవత్సరం. ఈ ఏడాదిలోనే ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ సాధ్యమైంది. గోల్డెన్ గ్లోబ్- హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు తెలుగు లోగిళ్లలో సంబరాలకు కారణమయ్యాయి. ఇప్పుడు ఆస్కార్ గీతం నాటు నాటుకు కర్త అయిన చంద్రబోస్ మరో అరుదైన ఘనతకు కారకులు.
బోస్ దీని గురించి ప్రస్థావిస్తూ.. ''ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊళ్లో సంబరాలు జరిగితే ఆ సంబరాలకు వెళ్లాను. అక్కడ అంతా బాగా పండగలా సాగింది. అయితే ఆ విజువల్స్ అన్నిటినీ డాక్యుమెంటైజ్ చేసారు. ఇది ఇప్పుడు కేన్స్ ఫిలింఫెస్టివల్ కి ఎంపికైంది'' అని తెలిపారు. చిల్కూరి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించిన 'ఆస్కార్ చల్లగరిగ' అనే డాక్యుమెంటరీ రెండు ప్రధాన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైంది. 2023 అకాడమీ అవార్డ్స్‌లో బ్లాక్‌బస్టర్ RRR చిత్రం నుండి ఉత్తమ ఒరిజినల్ పాట 'నాటు నాటు' కోసం ఆస్కార్ గెలుచుకున్న గీత రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గురించి ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు.
ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తన గ్రామం 'చల్లగరిగ'లో ఆహ్లాదమైన వాతావరణం అక్కడ ఆస్కార్ విక్టరీ వేడుకలకు సంబంధించిన అరుదైన డాక్యుమెంటరీ. ఆస్కార్ అవార్డు పొందిన తర్వాత బోస్ తన స్వగ్రామాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు అక్కడ స్పందన ఎలా ఉంది? సంబరాలు ఎలా సాగాయి? అన్నదే ఈ డాక్యుమెంటరీ కాన్సెప్ట్. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో చంద్రబోస్ ఈ వీడియోలో చెప్పారు. ఈ డాక్యుమెంటరీ డిసెంబరు 2023లో కేన్స్‌లో జరగనున్న నెలవారీ ఉత్సవం కోసం ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక అయింది. 'ఆస్కార్ చల్లగరిగ' 10 డిసెంబర్ 2023న ముంబైలో జరగనున్న 12వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ని మినీబాక్స్ ఆఫీస్ నిర్వహిస్తోంది.
ఈ ఈవెంట్-ఆధారిత డాక్యుమెంటరీ అకాడమీ అవార్డ్స్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ గెలుచుకున్న గీత రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గురించి అనేది సుస్పష్టం కావడంతో అది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు హైదరాబాద్‌కు చెందినవారు. అతని డాక్యుమెంటరీలు అనేక చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి. అవార్డులను గెలుచుకున్నాయి.