చంద్రముఖి.. దర్శకుడికి ATM లానే..
కంగనా రనౌత్ లీడ్ రోల్ లో లారెన్స్ కీలక పాత్రలో చంద్రముఖి 2 తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 3 Oct 2023 5:40 AM GMTకంగనా రనౌత్ లీడ్ రోల్ లో లారెన్స్ కీలక పాత్రలో చంద్రముఖి 2 తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కీరవాణి మ్యూజిక్ కూడా ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చంద్రముఖి 2ని తెరకెక్కించి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే మొదటిరోజే ఆడియన్స్ ఈ చిత్రంలో కొత్తదనం లేదని పక్కన పెట్టారు.
ఒక్క తమిళంలో మాత్రమే మోస్తరుగా ఆడుతోంది. అయితే చంద్రముఖి సిరీస్ కి ఒక ప్రత్యేకత ఉంది. దర్శకుడు పి వాసు ఎవరు చేయని ప్రయోగాన్ని ఈ సిరీస్ ద్వారా చేశారు. మలయాళంలో వచ్చిన ఆప్తరక్షక మూవీతో కన్నడంలో విష్ణువర్ధన్ తో ఆప్తమిత్రగా రీమేక్ చేశారు. ఎలాంటి మార్పులు చేయకుండా మొత్తం మక్కీకి మక్కీ దించేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిపొయింది. అదే కథని రజినీకాంత్ కి చెప్పారు.
సూపర్ స్టార్ కి నచ్చడంతో మళ్ళీ తమిళంలో చంద్రముఖిగా రీమేక్ అయ్యింది. దానినే తెలుగులో డబ్బింగ్ చేసి వదిలారు. రెండు భాషలలో మంచి హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ అంటూ కన్నడంలో క్లైమాక్స్ లో కొన్ని సీక్వెన్స్ మాత్రమే మార్చి ఆప్తమిత్ర 2గా తెరకెక్కించారు. ఆ మూవీ ఎవరేజ్ టాక్ సొంతం చేసుకోగా రజినీకాంత్ సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో తెలుగులో విక్టరీ వెంకటేష్ ని ఒప్పించి నాగవల్లి పేరుతో తెరకెక్కించారు.
చంద్రముఖి సినిమానే మళ్ళీ వెంకటేష్ వెర్షన్ లో చూసినట్లు ఉందని ఆ మూవీని ఆడియన్స్ తిరస్కరించారు. మళ్ళీ లాంగ్ గ్యాప్ ఇచ్చి అదే కథకి పెద్దగా మార్పులు చేయకుండానే కంగనా రనౌత్, లారెన్స్ లాంటి స్టార్స్ ని పెట్టుకొని తమిళంలో చంద్రముఖి 2గా తీసుకొచ్చారు.
ఈ సినిమాకి రిజల్ట్ మారలేదు. ఇలా ఒకే కథతో పి వాసు ఏకంగా ఐదు సినిమాలు చేసిన ఘనత దక్కించుకున్నారు. కథ, కథనంలో మార్పు లేకుండా సీక్వెల్ అని పేరు పెడితే నమ్మేసే పరిస్థితిలో ఎవరూ లేరని చంద్రముఖి 2తో స్పష్టం అయ్యింది. ఏదేమైనా ఆయన 5 సార్లు చంద్రముఖి కాన్సెప్ట్ తో బాగానే బిజినెస్ చేసుకున్నారు. నిర్మాత పరిస్థితి ఎలా ఉన్నా దర్శకుడు మాత్రం ATM తరహాలో బిగ్ రెమ్యునరేషన్ తీసుకుంటూ చంద్రముఖిని వాడేసుకున్నారని కామెంట్స్ వస్తున్నాయి.