బన్నీపై పవన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి! - అల్లు అర్జున్ మావయ్య,
నేటి తరం హీరోలు అటవీ సంపదను దోచేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి పరోక్షంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను తప్పు పట్టారు.
By: Tupaki Desk | 25 Aug 2024 5:35 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాన్ .. అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమాలో స్మగ్లర్ పాత్రని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి పవర్ స్టార్- ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా భారీ యుద్దమే జరిగింది. అభిమానం పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగి ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మావయ్య, స్నేహారెడ్డి తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి ఓ టెలివిజన్ ఛానల్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నేటి తరం హీరోలు అటవీ సంపదను దోచేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి పరోక్షంగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను తప్పు పట్టారు.
`అల్లు అర్జున్ కేవలం నటుడిగా స్మగ్లర్‌గా నటించాడు. నిజంగా ఆయన ఆ వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పెద్ద మనసుతో నా మాటల వెనుక ఉద్దేశం అది కాదు అని అంటే ఈ వివాదానికి తెర పడుతుంది. ఒకవేళ పవన్ కల్యాణ్ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే.. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి.. నీవు అలాంటి మాటలు మాట్లాడి ఉంటే.. భారత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే.
భారత ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డును ఇస్తే దానిని తప్పుపట్టినట్టే. పవన్ కల్యాణ్ మాటలపై చాలా మంది నాకు ఫోన్లు చేసి ఇలా అనడం ఏమిటి? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌పై నాగబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఏదో ఫ్రస్టేషన్‌తో అని ఉంటారు. ఆంధ్రాలో ఓ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారు. అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్లే అనుకోవాలి. వారి కోసం కూడా పనిచేయాలి.
నాయంగ్ ఏజ్ లో చిరంజీవి గారి సినిమాలన్నీ చేసేవాడిని. ఆయన పార్టీ పెట్టిన సమయంలో నేను ఆయన పార్టీకి పనిచేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీలు వేరు...ఇతర అంశాలు వేరు` అని అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంత వరకూ మౌనంగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి పవన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.