అమెరికా టాక్ షోలో మనోభావాలు బ్యూటీ!
`మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్` అంటూ సాంగేసుకున్న చంద్రికారవి సుపరిచితమే.
By: Tupaki Desk | 5 Jun 2024 10:05 AM GMT`మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్` అంటూ సాంగేసుకున్న చంద్రికారవి సుపరిచితమే. `వీరసింహారెడ్డి` లో ఆ పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ బ్యూటీ చంద్రిక. టాలీవుడ్ లో కంటే ముందు కోలీవుడ్ లో నే పరిచయమైంది. అక్కడో రెండు సినిమాలు చేసింది. కానీ అమ్మడికి ఇప్పుడు అక్కడా..ఇక్కడా అవకాశాలైతే పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు ఓ అమెరికన్ టాక్ షోకి హోస్ట్ గా ఎంపికైంది.
ఇదే షోకి చంద్రిక సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు చంద్రికా రవి పడ్డ కష్టాన్ని, చాలా మందికి స్పూర్తినిచ్చే ఆమె కథ గురించి తెలుసుకున్న రుకూస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సమ్మీ చంద్ చంద్రికారవికి ఈ అరుదైన అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆమూవ్ మెంట్స్ చంద్రిక మీడియాతో పంచుకుంది. యూఎస్‌లో అతిపెద్ద నెట్‌వర్క్‌ల్లో ఒకటైన ఐ హర్స్ట్ రేడియో లో ఈ షో ప్రసారం కానుంది.
టాక్ షో రూపకల్పన నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతీది నేను చూసుకున్నా. షోకు సంబంధించి ఎక్కువ వరకు ప్రమోషన్స్ నేను ఎడిట్ చేసి.. నిర్మించినవేనని గర్వంగా చెప్పగలను. కొన్నేళ్లుగా నా టాక్ షోపై వర్క్ చేస్తున్నా. ఈ షోకు జీవం పోయాల ఇప్పటివరకు వేచి చూశాను. ఈ షో కొంచెం ఒత్తిడితో కూడుకున్నప్పటికీ బహుమతిలాంటి అనుభవం. నా ఇన్నేళ్ల ప్రదర్శనలతో పోలిస్తే.. కెమెరా ముందు టాక్ షో నాకో కొత్త అనుభవం. ప్రజలు నిజమైన చంద్రికా రవిని చూస్తారు. నేను మొదటి వ్యక్తిని కావచ్చు.. కానీ నేను చివరిదాన్ని మాత్రం కాను` అని తెలిపింది.
చంద్రికా రవి సినిమాలకంటే ముందు రేడియో, టెలివిజన్ లో అనేక షోలు నిర్వహించింది. పబ్లిక్ స్పీకింగ్‌పై ఆసక్తి కూడా ఎక్కువ. యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ మహిళగా అరుదైన రికార్డు చంద్రిక సొంతమవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ప్రతీ గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రతీ శుక్రవారం ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.