Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మత్తెక్కించే అందాల చూపులు

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్‌ చంద్రిక రవి. నటిగా, డాన్సర్‌ గా, మోడల్‌ గా ఇప్పటికే ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   15 July 2024 7:30 AM GMT
పిక్ టాక్‌ : మత్తెక్కించే అందాల చూపులు
X

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్‌ చంద్రిక రవి. నటిగా, డాన్సర్‌ గా, మోడల్‌ గా ఇప్పటికే ఆస్ట్రేలియాలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

2018 లో ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు అనే సినిమాలో నటించడం ద్వారా ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తెలుగు లో చీకటి గదిలో చితక్కొట్టుడుగా రీమేక్‌ చేయబడింది. ఆ సినిమాలో అందాల ఆరబోత చేయడంతో పాటు, నటిగా మంచి మార్కులు సొంతం చేసుకుంది.

గత ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి పాటలో నటించింది. ఆ పాటతో టాలీవుడ్‌ లో మరింత బిజీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ చంద్రిక రవి మాత్రం టాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

సినిమాల్లో తక్కువ కనిపించినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియా ను షేక్‌ చేస్తున్నాయి.

కవ్వించే చూపులతో ఈ అమ్మడు మతి పోగొడుతుంది. మత్తెక్కించే ఆ చూపులను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటిలాగే వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడైనా సినిమాలతో ఈ అమ్మడు మరింత బిజీ అయ్యేనా చూడాలి.