Begin typing your search above and press return to search.

తండేల్ డైరెక్టర్.. మరి నెక్స్ట్ ఏంటీ?

ఇక సూర్య హీరోగా గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమా కూడా లైన్ లో ఉంది. అలాగే ఇప్పుడు, బాలీవుడ్ వైపు నుంచి కూడా ఛాన్సులు వస్తున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   20 March 2025 2:30 AM IST
తండేల్ డైరెక్టర్.. మరి నెక్స్ట్ ఏంటీ?
X

టాలీవుడ్ లో నేటితరం యువ దర్శకులలో మంచి గుర్తింపు అందుకున్న వారిలో చందూ ముండేటి టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. మొదటి సినిమా కార్తికేయ తోనే అతనికి మంచి క్రేజ్ దక్కింది. ఇక ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో కొత్త కొత్త ఎలిమెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. నాగచైతన్యతో ప్రేమమ్, ఇటీవల వచ్చిన తండేల్ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్ళను అందుకున్నాయి. ఇక కార్తికేయ 2 పాన్ ఇండియ రేంజ్ లో హిట్ అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమా నుంచే అతనిపై బాలీవుడ్ మేకర్స్ ఫోకస్ కూడా పడింది. కానీ అతను ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా కార్తికేయ 2 తరువాత తండేల్ సినిమానే చేశాడు. ఆ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ముదులిపేసింది. థియేటర్లలోనే కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక సూర్య హీరోగా గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమా కూడా లైన్ లో ఉంది. అలాగే ఇప్పుడు, బాలీవుడ్ వైపు నుంచి కూడా ఛాన్సులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే కార్తిక్ ఆర్యన్‌తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్తికేయ 2 సమయంలోనే ఆయన కార్తిక్‌కు ఒక కథ చెప్పారని, ఇప్పుడు అది ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్.

ఇదే కాదు, హృతిక్ రోషన్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. హృతిక్ సాధారణంగా కథను ఓకే చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు, కానీ చందూ చెప్పిన కథపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే, అది చందూ ముండేటికి బాలీవుడ్‌లో భారీ అవకాశాన్ని తెచ్చిపెట్టే చాన్స్ ఉంది.

తెలుగులో కూడా చందూ ముండేటి కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నాడు. రామ్ పోతినేనితో ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు మహేష్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ ఇటీవల సెట్స్ లోనే కలిసి చందూ స్టోరీని విన్నారట. గతంలో కూడా వీరిద్దరి మధ్య రెండు మూడు కథలు చర్చకు వచ్చాయి. ఇక ఈసారి రామ్ తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న చందూ ముండేటి బాలీవుడ్, టాలీవుడ్‌ల్లో రెండు భారీ ప్రాజెక్టులపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి తన తదుపరి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎవరు ముందుగా డేట్స్ ఇస్తారనే దానిపైనే ఆయన తదుపరి సినిమా ఆధారపడినట్లు తెలుస్తోంది. మరి ఛాన్స్ నెక్స్ట్ హీరోగా ఎవరు ఫైనల్ అవుతారో కాలమే సమాధానం ఇవ్వాలి.