Begin typing your search above and press return to search.

పాత్ర కోసం బాక్సింగ్ రెజ్లింగ్ స్విమ్మింగ్ నేర్చిన న‌టుడు

టాలీవుడ్ లో చాలామంది యువ‌హీరోలు ఎంపిక చేసుకున్న పాత్ర‌కోసం 6 ప్యాక్ ల‌తో అల‌రించారు

By:  Tupaki Desk   |   29 May 2024 5:15 AM GMT
పాత్ర కోసం బాక్సింగ్ రెజ్లింగ్ స్విమ్మింగ్ నేర్చిన న‌టుడు
X

టాలీవుడ్ లో చాలామంది యువ‌హీరోలు ఎంపిక చేసుకున్న పాత్ర‌కోసం 6 ప్యాక్ ల‌తో అల‌రించారు. దీనికోసం జిమ్ లో కోచ్ స‌మ‌క్షంలో చాలా శ్ర‌మించారు. బీస్ట్ మోడ్ లోకి మారిన హీరోలున్నారు. ఇటీవ‌లి కాలంలో న‌వ‌త‌రం న‌టులు నితిన్, అఖిల్, నిఖిల్, కార్తీక్ వంటి వారు త‌మ రూపాన్ని మార్చుకోవ‌డానికి చాలా తీవ్రంగా శ్ర‌మించారు.

ఇప్పుడు బాలీవుడ్ యువ‌న‌టుడు కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్ కోసం రెజ్లింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్ వంటి విద్య‌లు నేర్చుకున్నాడు. అత‌డు లుక్ ప‌రంగా చాలా మేకోవ‌ర్ సాధించాడు. ఈ చిత్రం నన్ను నా పరిమితులను పెంచేలా చేసింది అని అత‌డు చెప్పారు.

సాజిద్ నదియాడ్‌వాలా, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన `చందు ఛాంపియన్` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఒక‌ అసాధారణమైన యువ‌కుడి ప్ర‌యాణాన్ని తెర‌పై చూపించార‌ని ప్రూవ్ చేసింది. ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో కార్తీక్ ఆర్యన్ క‌నిపించాడు. ఈ మార్పు ట్రైలర్‌లో స్ప‌ష్ఠంగా క‌నిపించింది. అంతేకాదు..అత‌డు తెర‌పై పాత్ర కోసం పూర్తిగా భిన్నమైన మూడు క్రీడలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్ప‌డింది. ఇది కార్తీక్‌కు భిన్నమైన అనుభవం.

చందు ఛాంపియన్ పాత్రలో నటించడం గురించి తన అనుభవాన్ని షేర్ చేస్తూ కార్తీక్ ఇలా అన్నాడు. చందు ఛాంపియన్ కోసం సిద్ధం కావడం ఒక థ్రిల్లింగ్ ఛాలెంజ్. నేను రెజ్లింగ్, బాక్సింగ్ ,స్విమ్మింగ్-మూడు విభిన్నమైన క్రీడలను నేర్చుకోవలసి వచ్చింది. ఈ చిత్రానికి పని చేయడం నన్ను తయారు చేసింది. నా పరిమితులను పెంచుకున్నాను.. కానీ నేను ప్రతి క్రీడలో పట్టు సాధించడం కష్టమైంది. కానీ మురళీకాంత్ పాత్ర‌లోకి లైఫ్‌ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి సంతోషిస్తున్నాను... అన్నారు.

.సాజిద్ నడియాద్వాలా -కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన `చందు ఛాంపియన్` 14 జూన్ 2024న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.