Begin typing your search above and press return to search.

ఆ రొమాంటిక్ హీరో- హీరోయిన్ లేకుండానా?

ఒకవేళ యంగ్ హీరోకి జోడీ లేక‌పోతే సినిమాలో ఏమాత్రం రొమాన్స్ ఛాన్స్ లేన‌ట్లే. అస‌లే కార్తీక్ అంటే రొమాంటిక్ స్టార్ అనే ఇమేజ్ బలంగా ఉంది.

By:  Tupaki Desk   |   26 May 2024 6:50 AM GMT
ఆ రొమాంటిక్ హీరో- హీరోయిన్ లేకుండానా?
X

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ రొమాంటిక్ స్టార్ అనే ఇమేజ్ని అతికొద్ది కాలంలోనే ద‌క్కించుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా వ‌రుస విజ‌యాల‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో పుల్ బిజీగా ఉన్నాడు. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ 'చందు ఛాంపియ‌న్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయ పారాలింపియ‌న్ మురళీకాంత్ పేట్క‌ర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో మంచి అంచ‌నాలు క్రియేట్ అవుతున్నాయి.

పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసు కొస్తున్నారు. అయితే ఇంత‌వ‌ర‌కూ ఇందులో హీరోయిర్ ఎవ‌రు? అన్న‌ది యూనిట్ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. దీంతో అస‌లు సినిమాలో హీరోయిన్ ఉందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే గ‌త వారం భోపాల్ లో జ‌రిగిన ట్రైల‌ర్ ఈవెంట్లో భాగ్య శ్రీ భోర్సే ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం..కార్తీక్ వేదిక‌పై కి వెళ్లేస‌మ‌యంలో చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం.. ఆమెని చూసి కార్తీక్ న‌వ్వ‌డం చూసి ఇందులో హీరోయిన్ భాగ్య అన్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

అలాగే సోష‌ల్ మీడియాలో పాత్ర ప్ర‌త్యేకంగా ఉంటుందంటూ ఓ పోస్ట్ కూడా చేసింది. దీంతో సినిమాలో? ఆమె ఉందా? లేదా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. కానీ సినిమాలో ఎక్క‌డా ఆమె పేరుని యూనిట్ రివీల్ చేయ‌లేదు. చిత్ర బృందం అధికారికంగా ఏ న‌టి విష‌యాన్ని స్వ‌యంగా రివీల్ చేయ‌దు. అందులోనూ హీరోయిన్ పాత్ర విష‌యంలో అస్సులు ఛాన్స్ తీసుకోరు. కానీ భాగ్య శ్రీ పోస్ట్ చూస్తుంటే ఇదంతా ఓ ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తుంద‌ని నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఒకవేళ యంగ్ హీరోకి జోడీ లేక‌పోతే సినిమాలో ఏమాత్రం రొమాన్స్ ఛాన్స్ లేన‌ట్లే. అస‌లే కార్తీక్ అంటే రొమాంటిక్ స్టార్ అనే ఇమేజ్ బలంగా ఉంది. బ‌యోపిక్ కాబ‌ట్టి ఎక్కువ‌గా ఎమెష‌న్ కి పెద్ద పీట వేసి ఉంటార‌ని..అలాంటి స‌న్నివేశాల‌కు ఆస్కారం త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి భాగ్య‌తో రొమాన్స్ ఉందా? లేదా? అన్న‌ది రిలీజ్ త‌ర్వాతే తెలిసేది.