హైదరాబాద్ నే వైజాగ్ లా మార్చేస్తున్నారా
అప్పట్లో యావత్ దేశాన్ని కదలిం చిన వైజాగ్ లో చోటు చేసుకున్న ఓ యధార్ధ సంఘటన ఆ ధారంగా ఈ చిత్రన్ని రూపొందిస్తున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2023 9:59 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో తొలి భారీ బడ్జెట్ చిత్రంగా 'మట్కా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `పలాసా` ఫేం కరణ్ కుమార్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ కథ ఏకంగా ప్రేక్షకు ల్ని 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లబోతుంది. 1958-82 మధ్య సాగే స్టోరీ ఇది. అప్పట్లో యావత్ దేశాన్ని కదలిం చిన వైజాగ్ లో చోటు చేసుకున్న ఓ యధార్ధ సంఘటన ఆ ధారంగా ఈ చిత్రన్ని రూపొందిస్తున్నారు.
సినిమా అంతా పూర్తిగా వైజాగ్ నేపథ్యంలో ఉంటుంది. అందుకు తగ్గట్టు ప్రత్యేకంగా వింటేజ్ సెట్స్ ని నిర్మిస్తున్నారు. కథ ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆ సెట్ లోనే చిత్రీకరణ ఉంటుంది. ఔట్ డోర్ సన్నివేశాలు చాలా రేర్ గా ఉన్నాయి. 60-80 కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేకమైన సెట్లు నిర్మిస్తున్నారు. అయితే ఇవి వైజాగ్ లో నిర్మిస్తున్నారా? హైదరాబాద్ లోనా? అన్నది ఇంతవరకూ సరైన క్లారిటీ లేదు.
తాజాగా సెట్ నిర్మాణమంతా హైదరాబాద్ లోనే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అవసరం మేర విశాఖ వెళ్లి కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతారు మినహా పార్టు అంతా హైదరాబాద్ లోనే షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాతకాలపు వైజాగ్ సెట్‌ని నిర్మిస్తున్నారుట. 60 క్రితం నాటి వైజాగ్ ని సెట్ రూపంలో రీక్రియేట్ చేస్తున్నారుట. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
సెట్ నిర్మాణ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. ముందుగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా డిజైన్ చేసుకుని..డిజిటల్ మ్యాట్ ఇతర పెయింటింగ్స్ ద్వారా ఫైనల్ అయిన తర్వాత నిర్మాణం చేపడుతు న్నట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడుట. వాటి ఆహార్యం చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుం ది. అప్పటి మనుషులు ఎలా ఉండేవారు? ఎంత మాసివ్ గా ఉండేవారు? అన్నది సినిమాలో హైలైట్ చేయబోతున్నారు.