చరణ్‌తో కంటతడి పెట్టించిన అన్‌స్టాపబుల్ బాలయ్య
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో ఈ ఎపిసోడ్ నభూతోనభవిష్యతి అనేలా బాలయ్య హోస్టింగ్ సాగింది.
By: Tupaki Desk | 5 Jan 2025 5:59 AM GMTభారతదేశంలో అత్యుత్తమమైన ఫన్, హాస్య చతురత, మ్యానరిజమ్స్, స్వచ్ఛత ఉన్న హోస్ట్ ఎవరు? అంటే.. కచ్ఛితంగా నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు చెప్పాల్సిందే. ఇదిగో ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి అతడు 'ఆహా-ఓటీటీ' వేదికగా అన్ స్టాపబుల్ కామెడీతో రంజింపజేసారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో ఈ ఎపిసోడ్ నభూతోనభవిష్యతి అనేలా బాలయ్య హోస్టింగ్ సాగింది.
తన ఎదుట ఉన్న గెస్ట్ రామ్ చరణ్‌ని ఎన్బీకే అన్ స్టాపబుల్ గా నవ్వించారు.. ఏడిపించారు.. ఉద్వేగానికి గురయ్యేలా చేసారు. స్నేహంలో గొప్పతనం గురించి మాట్లాడించారు. భార్యతో అనుబంధం .. కుటుంబంలో బంధాలు అనుబంధాలు.. పెట్స్ పై ప్రేమ... ఇలా అన్ని కోణాల్లో వేదికకు విచ్చేసిన అతిథిలో భావోద్వేగాలు బయటపడేలా ప్రశ్నలు సాగాయి. బాలయ్య అన్ స్టాపబుల్ ప్రశ్నలు నిజంగా హృదయాలను తాకాయి. ఆయనలోని ఫన్ యాంగిల్ నిజంగా మరోసారి మైండ్ బ్లోవింగ్.
ఉపాసనకు భయపడతావా? అంటూ ప్రశ్నిస్తే.. 'వదిలేయండి సార్ ప్లీజ్! అంటూ చరణ్ చేతులెత్తి నమస్కరించేశారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి నట్టింటికి వచ్చేసినట్టే... ! అంటూ చరణ్ కంట తడి పెట్టించేశారు ఎన్బీకే. చరణ్- ఉపాసన దంపతులు ఈ ఏడాది మగపిల్లాడిని కనాలని ఇంట్లో వాళ్లు కోరుకుంటున్న విషయం కూడా షో రివీల్ చేసేసింది.
గ్లోబల్ స్టార్‌తో మెగా సర్‌ప్రైజ్‌లు, పవర్ ప్యాక్డ్ మూమెంట్స్ .. మెగా పవర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి! అంటూ తాజా ప్రకటనలో ఆహా ఎపిసోడ్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ''NBKS4తో #అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 9,... 8 జనవరి 7PMకి ప్రీమియర్ అందుబాటులో ఉంటుంది!'' అంటూ వివరాలు ప్రకటించింది. ఈ ఈవెంట్లో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు, చరణ్ స్నేహితుడు హీరో శర్వానంద్ తోను చిట్ చాట్ ఆసక్తి కలిగించనుంది. ప్రభాస్ తో చరణ్ ఫోన్ సంభాషణ కూడా మరో ఛమక్కు. మరో మూడు రోజుల్లో స్ట్రీమ్ కానున్న అన్ స్టాపబుల్ గేమ్ ఛేంజింగ్ షో కోసం వేచి చూడాల్సిందే.