'గేమ్ ఛేంజర్' లో ఆ రెండు నెవ్వర్ బిఫోర్ గా!
శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియాలో సంచలనం అవుతుందనే అంచనా లున్నాయి.
By: Tupaki Desk | 18 Dec 2024 9:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' రిలీజ్ సమయం దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తర్వాత చరణ్ సోలోగా వస్తోన్న చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియాలో సంచలనం అవుతుందనే అంచనా లున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు...టీజర్...లిరికల్ సింగిల్స్ ప్రతీది కనెక్ట్ అయింది. అన్నింటిని మించి సినిమా కంటెంట్ ముందే రివీల్ అయింది.
ఇదొక పొలిటికల్ స్టోరీ కావడం సహా చరణ్ ద్విపాత్రాభినయం చేయడం మరో హైలైట్. తండ్రీ కొడుకు గా చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఓపాత్ర రైతు అయితే మరో పాత్ర కలెక్టర్ కం పొలిటీషన్. ఈ మూడు పాత్రల్ని శంకర్ నెక్స్ట్ రేంజ్ లో చూపిస్తాడు? అనే అంచనాలు భారీగా ఉన్నాయి. అతడి 'ఒకే ఒక్కడు', 'జెంటిల్మెన్' లాంటి సినిమాల స్పూర్తితో ఈ చిత్రం రూపొందుతుందనే టాక్ తొలి నుంచి వినిపిస్తుంది. సినిమా ద్వారా సమాజానికి ఓ గొప్ప సందేశం కూడా ఇస్తున్నట్లు టీమ్ రివీల్ చేసింది.
అలాగే సినిమాలో నటించిన నటీనటులంతా సినిమా గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు. తాము పోషిస్తున్న పాత్రలు సహా కథ, కథనాలతో శంకర్ మార్క్ చిత్రంగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. మెగా అభిమానులకు ఇదొక బ్లాస్టింగ్ ఉంటుందిట. సినిమా మొత్తం రెండు గంటల యాభై నిమిషాలు. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్ గా ఉంటుందిట. ఈనేపథ్యంలో వచ్చే చరణ్ యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయట.
థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోవడం ఖాయమట. చరణ్ స్టైలిష్ యాక్షన్ మాములుగా ఉండదం టున్నారు. శంకర్ ఈ యాక్షన్ సీన్స్ యూనిక్ గా తెరకెక్కించినట్లు మాట్లాడుకుంటున్నారు. ఇక క్లైమాక్స్ లో ట్విస్టులు...ఛేజింగ్ సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకందని విధంగా ఉంటాయట. సినిమాలో ఈ రెండు యాక్షన్ బ్లాక్స్ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాయని అంటున్నారు. మరి ఈ ప్రచారం లో నిజమెంతో రిలీజ్ తర్వాత తేలుతుంది.