ఆర్ ఆర్ ఆర్ ద్వయం! ఆయనిలా..ఈయనిలా?
`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 April 2025 8:30 AM`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈసినిమా విజయంతో ఏకంగా గ్లోబల్ స్టార్లగా మారిపోయారు. అంతకు మించి వ్యక్తిగతంగా మంచి స్నేహితులయ్యారు. ఇలా ఆర్ ఆర్ ఆర్ ఇద్దరి జీవితాల్లో ఎన్నో కొత్త మార్పులు కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎవరికి వారు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరిలో లుక్ పరంగా చాలా మార్పులే కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా సన్నని తారా జువ్వలా మారిపోయాడు. ఒకప్పడు ఓవర్ వెయిట్తో ఉండే తారక్ కాలక్రమంలో లుక్ పరంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. తాజాగా ఎన్టీఆర్ కొత్త ఫోటోల్లో మరింత స్లిమ్ గా మారిపోయాడు. మళ్లీ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడో ఏమోగానీ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా నియమ నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపిస్తుంది. బేసిక్ గా ఎన్టీఆర్ మంచి పుడీ. ముక్క లేనిదే ముద్ద దిగదు.
అలాంటి తారక్ న్యూ లుక్ చూస్తుంటే ముక్కకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తుంది. మరి ఇదంతా సినిమా కోసమేనా? అంటే కాదని ఆరోగ్య పరంగానూ బాగుంటుందని తారక్ ఇలా స్లిమ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం లుక్ పరంగా కొన్ని మార్పులు కొరడంతో? ఆ మార్పులు ఎప్పుడో తీసు కొచ్చాడు. ఆ ఛేంజ్ లుక్ తో నే వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు.
ఇక చరణ్ అయితే తారక్ లుక్ కి పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉన్నాడు. కంప్లీట్ గా బల్కీ లుక్ లోకి మారిపోయాడు. పెద్ది సినిమా లో మాస్ అండ్ రగ్గడ్ రోల్ కూడా కావడంతో? ఆ మాత్ర బలీయంగా ఉండటం అవసరమని దర్శకుడు బుచ్చిబాబు కోరడంతో? కాస్త చబ్బీగానే కనిపిస్తున్నాడు. ఆ మాస్ లుక్ చరణ్ కి పర్పెక్ట్ గానూ సెట్ అయింది. ఇలా స్నేహితులిద్దరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నారు.