ఇట్స్ ఈవెంట్ టైమ్.. సూపర్ స్టైలిష్ గా చరణ్..
పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వనున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 20 Dec 2024 3:59 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వనున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చాలా రోజుల క్రితమే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హైప్ సృష్టిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో పాటు మూడు సాంగ్స్ ను విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.
అయితే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టెక్సాస్ లోని డల్లాస్ కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ వేదికగా డిసెంబర్ 20వ తేదీన మెగా ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేశారు.
యూఎస్ లో తెలుగు ప్రజలంతా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని రామ్ చరణ్.. వీడియో మెసేజ్ ద్వారా గురువారం ఇన్వైట్ చేశారు. టెక్సాస్ లో ఉన్న స్థానికులు హాజరవ్వాలని కోరారు. ఇప్పుడు ఈవెంట్ కోసం అమెరికా బయలుదేరి వెళ్ళారు. ఆ విషయాన్ని గేమ్ ఛేంజర్ మేకర్స్.. సోషల్ మీడియాలో తెలిపి కొన్ని పిక్స్ ను షేర్ చేశారు.
'అమెరికాలో జరగనున్న ఈవెంట్ గా చరణ్ బయలుదేరి వెళ్లారు.. రెడీ ఫర్ హిస్టరీ.. డల్లాస్ లో కలుద్దాం' అంటూ రాసుకొచ్చారు. దాంతోపాటు ఎయిర్ పోర్ట్ లో చరణ్ ఉన్న పిక్స్ ను పోస్ట్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. చరణ్ లుక్ అదిరిపోయిందని, కిర్రాక్ గా ఉన్నారని మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న చరణ్.. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. బ్లాక్ క్యాప్, జాకెట్ తో రగ్డ్ లుక్ లో సందడి చేశారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేస్తున్న సినిమా కోసం ఆయన ఫుల్ గా మేకోవర్ అయినట్లు అర్థమవుతోంది. గేమ్ ఛేంజర్ ప్రమోషనల్ కంటెంట్ లో డీసెంట్ గా కనిపించిన చరణ్.. RC 16లో మాస్ లుక్ లో కనపడనున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.