Begin typing your search above and press return to search.

డార్లింగ్ తార‌క్ కోసం చ‌ర‌ణ్ ఇలా వ‌చ్చాడు!

వ్య‌క్తిగ‌తంగా తార‌క్ ని అభిమానిచే విశ్వ‌క్ సేన్..సిద్దు జొన్న‌ల గ‌డ్డ లాంటి యంగ్ హీరోలు స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ కూడా చేసారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 11:29 AM GMT
డార్లింగ్ తార‌క్ కోసం చ‌ర‌ణ్ ఇలా వ‌చ్చాడు!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విషెస్ కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. `దేవ‌ర` ప్ర‌చారం ప‌నులు మొద‌లైన నాటి నుంచి తార‌క్ కి అంతా విషెస్ తెలియ‌జేస్తున్నారు. తార‌క్ ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. వ్య‌క్తిగ‌తంగా తార‌క్ ని అభిమానిచే విశ్వ‌క్ సేన్..సిద్దు జొన్న‌ల గ‌డ్డ లాంటి యంగ్ హీరోలు స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ కూడా చేసారు.

గ‌త ప‌ది రోజులుగా సోషల్ మీడియా అంత‌టా తార‌క్ నామ‌స్మ‌ర‌ణే క‌నిపిస్తుంది. అయితే స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ మాత్రం ట‌చ్ లోకి రాలేదు. ఎంతో మంది హీరోలు దేవ‌ర గురించి స్పందిస్తున్నారు కానీ...చ‌ర‌ణ్ మాత్రం మాట్లాడ‌టం లేద‌నే చ‌ర్చ సైతం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఇందులోకి ఏవైనా రాజ‌కీయాలు చొర‌బ‌డ్డ‌యా? అన్న సందేహం సైతం క‌లిగింది. అందుకే చ‌ర‌ణ్ స్పందించ‌డం లేదా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే తాజాగా అన్నింటికి తెర దించుతూ చ‌ర‌ణ్ ఎక్స్ త‌న డార్లింగ్ తార‌క్ విషెస్ తెలియ‌జేసారు.` రేపు దేవర సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నా సోదరుడు తారక్ కు మరియు చిత్ర బృందానికి శుభాకాం క్షలు తెలుపుతున్నాను` అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో తార‌క్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చరణ్ కు అభిమానులు థాంక్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు.

మరి `దేవర` సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. సినిమా భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. ఈరోజు అర్ద‌రాత్రి నుంచే షోలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో హ‌డావుడి రాత్రి నుంచే మొద‌లవుతుంది. ఇప్ప‌టికే థియేట‌ర్లు పూల మాల‌లో ముస్తాబ‌య్యాయి.