అప్పాతో చెర్రీ.. వ్వాటే బర్త్ డే ట్రీట్
ఇద్దరూ టింగురంగళ్లలా అలా పంచె కట్టులో కనిపిస్తుంటే ట్రెడిషన్ ఉట్టి పడుతోంది.
By: Tupaki Desk | 22 Aug 2024 5:20 PM GMTఅవును.. అప్పాకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ చెర్రీ ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు సేవాకార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే, చరణ్ ఇలాంటి స్పెషల్ ఫోటోషూట్లతో గడిపాడు. ఇదిగో అప్పా చిరంజీవితో చరణ్ స్పెషల్ ఫోటోగ్రాఫ్.. ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఇద్దరూ టింగురంగళ్లలా అలా పంచె కట్టులో కనిపిస్తుంటే ట్రెడిషన్ ఉట్టి పడుతోంది. జెరీ అంచు సిల్కు పంచె ఆ పైన తళతళా మెరిసే సిల్కు చొక్కాల్లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి పాపాతో కలిసి చరణ్ ప్లానింగు బాగానే ఉంది కానీ.. ఇలా తీరుగ్గా రెడీ అవ్వడానికి ఎంత టైమ్ తీసుకున్నారో తండ్రి కొడుకులు. కానీ ఈ లుక్ చూశాక మెగా ఫ్యాన్స్ ఫుల్ గా ఛీరప్ చేస్తున్నారు.
ఎంపిక చేసిన లుక్ కి తగ్గట్టే చిరు-చరణ్ బ్లాక్ కలర్ కళ్లద్దాలు పెట్టుకుని, గోల్డ్ కలర్ వాచీలు ధరించి సోగ్గా కనిపించారు. ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్ ని సోసల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్ ``హ్యాపీయెస్ట్ బర్త్ డే అప్పా!`` అని వ్యాఖ్యను జోడించాడు. నాన్న గారు అని ప్రతిసారీ పిలిచే రామ్ చరణ్ ఇప్పుడు అప్పా అని కొత్తగా పిలిచారు చిరును. ఇది చాలా ప్రత్యేకమైన సౌండింగ్ తో అభిమానుల గుండెల్లో మోగుతోంది. ఈ పిలుపు చాలా స్పెషల్ గా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
ఇక చరణ్ - చిరు కలిసి నటించే సినిమా ఎప్పుడు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. బ్రూస్ లీ, ఆచార్య తర్వాత ఇప్పట్లో అలాంటి ప్లానింగ్ ఏదీ కనిపించడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉంటే, చిరంజీవి విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇవి రెండూ భారీ పాన్ ఇండియా సినిమాలు. గేమ్ ఛేంజర్ ఈ ఏడాదిలో విడుదల కానుండగా, విశ్వంభర సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.