చరణ్-ఎన్టీఆర్ అతన్ని ఫాలో అవుతున్నారా?
`రాధేశ్యామ్` రిలీజ్ అనంతరం ఏడాది గ్యాప్ లో `ఆదిపురుష్` సినిమాతో డార్లింగ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
By: Tupaki Desk | 5 April 2024 3:30 PM GMTగ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్- ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోని ఫాలో అవుతున్నారా? అతన్ని మించి గొప్ప ప్రణాళిక మరోటి లేదని నమ్ముతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఎవరా స్టార్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. `బాహుబలి` తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ `రాధేశ్యామ్` తర్వాత కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో అతడి ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో? ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో? కమిట్ అయిన విధానం.. అవి రిలీజ్ అవుతున్న విధానాన్ని బట్టి చెప్పొచ్చు.
`రాధేశ్యామ్` రిలీజ్ అనంతరం ఏడాది గ్యాప్ లో `ఆదిపురుష్` సినిమాతో డార్లింగ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే ఏడాది ముగింపు డిసెంబర్ లో `సలార్ సీజ్ ఫైర్` ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆరు నెలల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. 2024 మే లో `కల్కి 2898` కూడా రిలీజ్ అవుతుంది. `సలార్-కల్కీ` మధ్య గ్యాప్ కూడా ఐదు నెలలో కనిపిస్తుంది. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న `రాజాసాబ్` సెట్స్ లో ఉంది. త్వరలో సలార్ -2 షూటింగ్ మొదలువుతుంది.
ఈ రెండు కూడా వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ నుంచి సందీప్ వంగ తెరకెక్కించనున్న `స్పిరిట్` షూటింగ్ మొదలవుతుంది. ఇది 2026 లో రిలీజ్ అవుతుంది. ఈలోపు హనురాఘవపూడి చిత్రం కూడా పట్టాలెక్కుతుంది. సెట్స్ కి వెళడం డిలే అయినా రిలీజ్ విషయంలో డార్లింగ్ పెద్దగా గ్యాప్ తీసుకోవడం లేదు. సరిగ్గా ఇప్పుడిదే స్ట్రాటజీని రామ్ చరణ్-ఎన్టీఆర్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.
`ఆర్ ఆర్ ఆర్` సెట్స్ లో ఉండగానే `గేమ్ ఛేంజర్` కమిట్ అయ్యాడు చరణ్. రిలీజ్ డిలే అయినా అతడి ప్లానింగ్ లోపం లేదు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే బుచ్చిబాబుతో ఆర్సీ 16 పట్టాలెక్కించాడు. ఇది ప్రారంభమైన అనంతరం ఆర్సీ 17 సుకుమార్ తో ప్రకటించాడు. ఇవన్నీ పెద్దగా గ్యాప్ లేకుండానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ కూడా `దేవర` చిత్రాన్ని ఇదే వ్యత్యాసంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అక్టోబర్ లో `దేవర` మొదటి భాగం రిలీజ్ అవుతుంది. అటుపై ఆరు నెలల గ్యాప్ లోనే `వార్ 2` రిలీజ్ అవుతుంది. అనంతరం నెలల వ్యవధిలోనే `దేవర-2`ని కూడా రిలీజ్ చేయనున్నాడు.