Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ అభిమాన న‌టుడు-న‌టి వీళ్లే!

ఇటీవ‌లే భార్య ఉపాస‌న‌తో క‌లిసి మెల్బోర్న్ వేడుక ల‌కు హాజ‌రై వ‌చ్చాడు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 11:41 AM GMT
రామ్ చ‌ర‌ణ్ అభిమాన న‌టుడు-న‌టి వీళ్లే!
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' నుంచి ఫ్రీ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న పార్ట్ షూట్ పూర్త వ్వ‌డంతో ఖాళీ స‌మ‌యం దొరుకుతుంది. కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి ముందే పూర్తి చేయాల్సిన ప‌నులేమైనా ఉంటే వాటిని ముగించే ప‌నిలో ప‌డ్డారు. ఇటీవ‌లే భార్య ఉపాస‌న‌తో క‌లిసి మెల్బోర్న్ వేడుక ల‌కు హాజ‌రై వ‌చ్చాడు. తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ కార్యక్ర‌మానికి హాజ‌ర‌య్యాడు.

ఇందులో చ‌ర‌ణ్ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు రివీల్ చేసాడు. త‌న అభిమాన న‌టుడు కోలీవుడ్ హీరో సూర్య అంటూ స‌ర్ ప్రైజ్ చేసాడు. ఇంత‌వ‌ర‌కూ ఈ విషయాన్ని ఆయ‌న ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. దీంతో సూర్య కి మ‌రో స్టార్ కూడా పెద్ద ప్యాన్ అని తేలిపోయింది. సూర్యికి డార్లింగ్ ప్ర‌భాస్ కూడా మంచి అభిమాని. సూర్య కళ్లు అంటే ఎంతో ఇష్టం. అలాగే రానాకి కూడా సూర్య న‌ట‌న అంటే ఎంతో ఇష్టం.

యాక్టింగ్ కి సంబంధించిన టెక్నిక్స్ అన్నీ రానా సూర్య నుంచి నేర్చుకున్నవే. అలా ఆ ముగ్గురు కూడా సూర్యికి అభిమానులుగా మారిపోయారు. అలాగే చ‌ర‌ణ్ అభిమాన న‌టిగా స‌మంత పేరు చెప్పాడు. స‌మంతతో క‌లిసి మ‌ళ్లీ సినిమా చాలి ఉంద‌న్న కోర్కెని సైతం చ‌ర‌ణ్ బ‌య‌ట పెట్టాడు. తానో ప్రోఫెష‌న‌ల్ న‌టి అని... తెర‌పై ఆమెతో న‌టించ‌డం ఎంతో సౌక‌ర్య వంతంగా ఉంటుంద‌న్నాడు.

మ‌రి ఆ కాంబినేష‌న్ మ‌ళ్లీ సాధ్య‌ప‌డుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. గ‌తంలో ఇద్ద‌రు 'రంగ‌స్థ‌లం'లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిట్టిబాబు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌... రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో స‌మంత న‌టించారు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అద్బుతంగా పండింది. అదో క్లాసిక్ సినిమా ఇండస్ట్రీ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది.