ధూమ్ - 4 లో చరణ్..ముంబైలో అసలేం జరుగుతోంది?
ఆ సినిమా పాన్ ఇండియాని షేక్ చేయడంతోనే తారక్ బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు.
By: Tupaki Desk | 30 Dec 2023 11:38 AM GMT'వార్ -2' తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ షురూ చేసాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి టైగర్ నటిస్తున్నాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది? అన్నది ఇంతవరకూ క్లారిటీ లేని అంశం. అది పాజిటిల్ రోల్ నా? లేక హృతిక్ ని ఢీకొట్టే రోలా? అన్నది తెలియదు. కానీ తారక్ నటిస్తున్నా డంటే? ఆ పాత్ర ఎంత బలంగా ఉంటుందో గెస్ చేయోచ్చు. ఇదంతా 'ఆర్ ఆర్ ఆర్' వల్లే సాధ్యమైంది.
ఆ సినిమా పాన్ ఇండియాని షేక్ చేయడంతోనే తారక్ బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. మరి దోస్త్ లాంచ్ అయితే మరో దోస్త్ రామ్ చరణ్ ఏం చేయాలి? ఆయన కూడా బాలీవుడ్ సినిమా చేయాలా? వద్దా? అన్న సందేహం రాక మానదు. పాన్ ఇండియా క్రేజ్ ని బాలీవుడ్ లోనూ ఎన్ క్యాష్ చేయాలంటే ఇదే సరైన టైమ్ అని తారక్ అక్కడ లాంచ్ అవుతున్నాడు. ఇప్పుడు చరణ్ కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది.
ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ముంబై ఎక్కువగా వెళ్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వెళ్తున్నాడు..వస్తున్నాడు. కానీ ఏదో బిజినెస్ పనులో... వ్యక్తిగత పనులో అనుకున్నారు గానీ! ఏకంగా బాలీవుడ్ లో సినిమానే ప్లాన్ చేస్తున్నాడా? అన్న సందేహం తాజాగా అభిమానుల్లో సందేహానికి దారి తీసింది. అక్కడ ఏ కంగా అద్దెకి ఓ ప్లాట్ తీసుకుని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లతోనే చరణ్ చర్చలు జరుపుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో చరణ్ 'ధూమ్-4' లో నటిస్తున్నాడా? అన్న ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. 'వార్' ప్రాంచైజీలో కి తారక్ వెళ్లినట్లే 'ధూమ్' ప్రాంచైజీలోకి చరణ్ ఎంటర్ అవుతున్నాడా? అన్న సందేహం నెట్టింట అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. అదే నిజమైతే అభిమానుల ఆనందానికి అవదులుండవ్. ధూమ్ ఏరేంజ్ సిరీస్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యశ్ రాజ్ బ్యానర్లో అదో స్పెషల్ సిరీస్. దూమ్ వసూళ్లు ఓ సంచలనం. ఇందులో నటించిన ప్రతీ హీరో ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యారు.
అలాంటి ఛాన్స్ చరణ్ కి వస్తే ఎందుకు వదలుకుంటాడు? అన్నది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. వాస్తవానికి ఈ సిరీస్ లో ఇంతవరకూ బాలీవుడ్ హీరోల పేర్లే తెరపైకి వచ్చాయి తప్ప! చరణ్ పేరు రాలేదు. దీంతో ఇప్పుడీ రేసులో చరణ్ కూడా చేరినట్లు అవుతుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం తెలియాల్సి ఉంది. 'జంజీర్' రీమేక్ తో చరణ్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే