Begin typing your search above and press return to search.

T10 టీమ్‌ని కొనుగోలు చేసిన చ‌రణ్

తాను ఐఎస్ పిఎల్ హైద‌రాబాద్ జ‌ట్టుకు య‌జ‌మానిగా ఉన్నాన‌ని తెలిపాడు. ఛార్మినార్ నేప‌థ్యంలో రూపొందించిన పోస్ట‌ర్ పై చ‌ర‌ణ్ ఫోటోతో ఈ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ గా మారుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:01 AM GMT
T10 టీమ్‌ని కొనుగోలు చేసిన చ‌రణ్
X

గ్లోబ‌ల్ స్టార్‌గా ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని తెచ్చుకుంటున్న రామ్ చ‌ర‌ణ్ ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను సుప్ర‌సిద్ధుడు. విమాన‌యాన రంగంలో 'ట్రూజెట్ ఎయిర్‌వేస్' య‌జ‌మానిగా ఉన్న చ‌ర‌ణ్ సినీనిర్మాత‌గాను సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీని న‌డిపిస్తున్నారు. 1300 కోట్ల నిక‌ర ఆస్తులు ఉన్న స్టార్ హీరోగా చ‌ర‌ణ్ సుప‌రిచితులు.


ప్రస్తుతం దర్శకుడు శంకర్ షణ్ముగం తెర‌కెక్కిస్తున్న భారీ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ లో న‌టిస్తున్నాడు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో లేడీ కియారా అద్వానీ క‌థానాయిక‌. 2024లో ఈ సినిమా విడుద‌ల కానుంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర ఫ్రాంఛైజీ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే ఇది వ్యాపారం కంటే ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే ధృక్ప‌థంగా చూడాలి.

ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ త‌దిత‌రులు ప్ర‌మోట్ చేస్తున్న ISPL-T10 (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ - T10)లో తాను కూడా ఒక క్రికెట్ జట్టుకు యాజమానిగా కొన‌సాగుతున్నాన‌ని చ‌ర‌ణ్‌ గర్వంగా ప్రకటించాడు. తాను ఐఎస్ పిఎల్ హైద‌రాబాద్ జ‌ట్టుకు య‌జ‌మానిగా ఉన్నాన‌ని తెలిపాడు. ఛార్మినార్ నేప‌థ్యంలో రూపొందించిన పోస్ట‌ర్ పై చ‌ర‌ణ్ ఫోటోతో ఈ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ గా మారుతోంది.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ త‌దుప‌రి గేమ్ ఛేంజర్ థియేట్రికల్ విడుద‌ల కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 2024లో విడుదల కానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాను త్వ‌ర‌లో ప్రారంభించబోతున్నాడు.

ISPL ముంబై జ‌ట్టు ఓన‌ర్ :

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. లీగ్‌తో తన అనుబంధం గురించి అమితాబ్ ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో ప్రకటించారు. తాను ముంబై టీమ్ కి య‌జ‌మానిగా కొన‌సాగుతున్నాన‌ని తెలిపారు. "ఐఎస్‌పిఎల్-ది స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తో భాగ‌స్వామ్యంలో దీక్ష, ధైర్యం, శ్రద్ధ, భావనతో నిండిన మ‌న‌సు ఎంతో ఉత్తేజ‌క‌ర‌మైన‌ది.. అత్యంత గొప్పది" అని క్యాప్షన్‌లో రాశారు. "వీధుల్లో గల్లీల్లో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి... క్రికెట్ ఆడేందుకు షిఫ్ట్ హోమ్ మేడ్ పిచ్‌లను తయారుచేసే వారికి.. ఇప్పుడు వృత్తిపరంగా జట్టుకు ఎంపికై ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ముందు అధికారిక సెటప్‌లలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశం. ముంబయి జట్టు యజమానిగా ఉండటం ప్రతిభను చాటుకోవడం, గొప్ప దార్శనిక భవిష్యత్తు కోసం గోప్యంగా ఉండటం నాకు గౌరవం అలాగే ఎంతో ప్రత్యేకత"అన్నారు.

ISPL భారతదేశం మొదటి టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ స్టేడియం లోపల ఆడతారు. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ అనే ఆరు జట్ల లైనప్‌తో 19 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో శ్రీనగర్ జట్టును బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నాడు. లీగ్ ప్రారంభ ఎడిషన్ మార్చి 2 నుండి మార్చి 9 వరకు ముంబైలో జరగనుంది. అమితాబ్ త‌దుప‌రి ద‌క్షిణాది అగ్ర హీరోల‌తో క‌లిసి ప‌లు మ‌ల్టీస్టారర్ల‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. అదే స‌మ‌యంలో హిందీ చిత్ర‌సీమ‌లో క్రేజీ చిత్రాల్లో న‌టించ‌నున్నారు. మ‌రోవైపు కేబీసీ హోస్ట్ గాను అత‌డు సుదీర్ఘ కాలం త‌న హోదాను కాపాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే.