ఉపాసన లేకుండా కొత్త ఫ్రెండుతో షికార్?
చరణ్ షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ లో తనతో పాటే విమానంలో తన 𝑷𝑨𝑾 స్నేహితుడు రైమ్ (పెట్ డాగ్) ఉన్నాడు.
By: Tupaki Desk | 30 March 2024 4:50 AM GMT'గేమ్ ఛేంజర్' సినిమాతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. శంకర్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాజీ అన్నదే లేకుండా తెరకెక్కిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో చరణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. సాధ్యమైనంత తొందర్లోనే నిర్మాతలు రిలీజ్ తేదీని కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఇటీవల షెడ్యూల్ కి బ్రేక్ వేసి రామ్ చరణ్ తన ఫ్రెండుతో విహారయాత్రకు వెళ్లాడు. ఆసక్తికరంగా జెట్ విమానంలో సాగిన ఈ యాత్రలో తన సతీమణి ఉపాసన కనిపించలేదు. చరణ్ షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ లో తనతో పాటే విమానంలో తన 𝑷𝑨𝑾 స్నేహితుడు రైమ్ (పెట్ డాగ్) ఉన్నాడు.
వెకేషన్ మోడ్ ఆన్! అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు చరణ్. తాజా ఫోటోగ్రాఫ్ తో పాటు #GameChanger #RC16 #RC17 అంటూ హ్యాష్ ట్యాగుల్ని వైరల్ చేసారు.ఈ ఫోటోగ్రాఫ్ లో చరణ్ విమానం విండోలోంచి దూరంగా చూస్తూ కనిపించాడు. అతడు సౌకర్యవంతమైన బ్లాక్ కలర్ ఫ్యాంట్, కాంబినేషన్ షర్ట్ లో సింపుల్ గా స్టైలిష్ గాను కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
గేమ్ ఛేంజర్ పైనే దృష్టి అంతా:
రామ్ చరణ్ ఏడాదిన్నర కాలంగా పూర్తిగా గేమ్ ఛేంజర్ పైనే దృష్టి సారించాడు. ఈ సినిమా కోసం అతడు రేయింబవళ్లు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. భారీ స్టంట్స్ తో పాటు, పాటల కోసం అదనపు ఎఫర్ట్ పెడుతున్నాడు. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయని, ప్రతి ఒక్కటి విజనరీ డైరెక్టర్ శంకర్ స్వయంగా డిజైన్ చేశారని ఇటీవల దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే. పాటల్లో చరణ్ ఎంతో స్మార్ట్ గాను కనిపిస్తున్నాడు. సినిమాలోని 5 పాటల్లో 3 పాటలు ప్రేక్షకులను థియేటర్లలో బోల్తా కొట్టిస్తాయని కూడా దిల్ రాజు అన్నారు.
రామ్ చరణ్ - కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ లో ఎస్‌జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చే బాధ్యతను థమన్ ఎస్‌కి అప్పగించారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ జరగండి ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎస్. తిర్రు అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను షమీర్ ముహమ్మద్‌కు అప్పగించారు.