చరణ్ vs పవన్.. ఇలా జరగదు కదా?
గత ఏడాదే విడుదల కావలసిన ఈ సినిమా పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడంతో ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2024 8:35 AM GMT'RRR' తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత ఆచార్యతో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడు. దాంతో ఫాన్స్ ఆశలన్నీ 'గేమ్ ఛేంజర్' పైనే ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. గత ఏడాదే విడుదల కావలసిన ఈ సినిమా పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడంతో ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' తో పాటు 'ఇండియన్ 2' ని ఒకేసారి షూట్ ప్లాన్ చేయడంతో గేమ్ ఛేంజర్ డిలే అవుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది జూన్ కల్లా చిత్రీకరణ అంతా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు శంకర్ ఇండియన్ 2 మూవీ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు గత కొద్దిరోజులుగా టాక్ వినిపించింది. అదే జరిగితే గేమ్ చేంజర్ రిలీజ్ ఈ ఏడాది క్రిస్మస్ కి లేదా 2025 కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'ఇండియన్ 2' సమ్మర్ కానుకగా మేలో రానున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంతేకాదు త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి అందులోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే గేమ్ చేంజర్ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ డేట్ కి పవన్ కళ్యాణ్ 'OG' మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.
మే లో పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అవుతారని ఇటీవల నిర్మాత దానయ్య చెప్పుకొచ్చారు. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ 'OG' కి పోటీగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. అటు శంకర్ ఇటు రాంచరణ్ ఇద్దరికీ వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు ఉంది. అందుకే సినిమా అన్ని భాషల్లో మంచి ప్రదర్శన కనబరచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.
ఒకవేళ అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద OG vs గేమ్ ఛేంజర్ మధ్య భారీ పోటీ ఉండబోతోంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ 'OG' సినిమాకే ఇబ్బందిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా పైనే కాదు అక్టోబర్ 10 ని రిలీజ్ కాబోతున్న 'దేవర' పై కూడా 'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్ ఉంటుంది. RRR తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే విషయంలో నిరంతరం గొడవలు పడుతూనే ఉన్నారు. గేమ్ ఛేంజర్, దేవర రిలీజ్ తర్వాత ఇద్దరు హీరోల్లో ఎవరికి ఎక్కువ మార్కెట్ ఉందో తెలిసిపోతుంది. దాంతో ఫ్యాన్స్ మధ్య గోవడలకు పుల్ స్టాప్ పడుతుంది.