Begin typing your search above and press return to search.

లుక్కు సెటప్పు అంతా ఊర మాస్..!

ఐతే ఈ సినిమా విషయంలో ఇప్పటికే బయటకు వస్తున్న వార్తలు అదరగొడుతుండగా లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

By:  Tupaki Desk   |   22 July 2024 12:30 PM GMT
లుక్కు సెటప్పు అంతా ఊర మాస్..!
X

గ్లోబల్ స్టార్ రాం చరణ్ తన నెక్స్ట్ సినిమాను బుచ్చి బాబు డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నంతోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న బుచ్చి బాబు తన సెకండ్ అటెంప్ట్ ని కూడా దానికి మించి ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చరణ్ 16వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఐతే ఈ సినిమా విషయంలో ఇప్పటికే బయటకు వస్తున్న వార్తలు అదరగొడుతుండగా లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

సినిమాలో చరణ్ ఒక స్పోర్ట్స్ మన్ గా కనిపిస్తాడని తెలుస్తుండగా ఆ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు లుక్కు సెటప్పు అంతా కూడా ఊర మాస్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. చరణ్ పూర్తిస్థాయి మేకోవర్ ఉంటుందని తప్పకుండా ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ కిక్ అందిస్తుందని అంటున్నారు. ఈ సినిమా కాస్టింగ్ తో కూడ బుచ్చి బాబు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. హీరోయిన్ గా జాన్విని తెచ్చి చరణ్ కి ఫిక్స్ చేయగా ప్రాజెక్ట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఈమధ్యనే ఆయన్ను కన్ఫర్మ్ చేస్తూ దర్శక నిర్మాతలు పోస్టర్ వేశారు. ఆల్రెడీ రంగస్థలం సినిమా కోసం చరణ్ విలేజ్ లుక్ ట్రై చేశాడు. ఐతే ఈ సినిమాలో అది వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. రంగస్థలం కథ వేరు ఆ సినిమాలో పాత్ర స్వభావం వేరు. కానీ బుచ్చి బాబు సినిమాలో చరణ్ రోల్ చాలా కొత్తగా ఉంటుందట. సినిమాలో హీరోకి కొన్ని స్పెషల్ మేనరిజంస్ ఉంటాయని అంటున్నారు.

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా రిలీజ్ తర్వాత పూర్తి టైం తన 16వ సినిమాకే కేటాయిస్తాడని తెలుస్తుంది. మరి బుచ్చి బాబు మీద చరణ్ పెట్టిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడన్నది చూడాలి. చరణ్ గేం చేంజర్ ఈ ఇయర్ క్రిస్మస్ రేసులో నిలబడుతుందగా చరణ్ ఎంట్రీ తో ఆ టైం లో రిలీజ్ చేయాలని అనుకున్న సినిమాలకు పెద్ద షాక్ ఇచ్చినట్టు అవుతుంది. గేమ్ చేంజర్ సినిమా తర్వాత చరణ్ బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాకు దాదాపు 2,3 ఏళ్లు టైం ఇవ్వాల్సిందే అంటున్నారు.