Begin typing your search above and press return to search.

వీడియో : మహేష్‌ మామను దించేశాడుగా..!

సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబుతో పాటు పలువురు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   15 Jun 2024 7:12 AM GMT
వీడియో : మహేష్‌ మామను దించేశాడుగా..!
X

సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబుతో పాటు పలువురు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కృష్ణ అల్లుడు అయిన సుధీర్‌ బాబు హీరోగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఫ్యామిలీ ఇమేజ్ ను పెద్దగా వాడుకోకుండా సొంతంగా స్టార్‌డం ను దక్కించుకునేందుకు కృషి చేస్తున్నాడు.

ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి థర్డ్‌ జనరేషన్ హీరోలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరో వైపు సుధీర్ బాబు కొడుకులు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే సుధీర్ బాబు కొడుకులు ఇద్దరు కూడా బాల నటులుగా నటించారు. తాజాగా సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్‌ వీడియో వైరల్‌ అవుతుంది. మేనమామ మహేష్ బాబును అచ్చు దించినట్లు లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్క్ ను చూపిస్తున్నాడు.

చరిత్‌ ఇటీవల ఒక వీడియో తో వైరల్‌ అయ్యాడు. మామ మహేష్‌ బాబు తరహా హెయిర్ స్టైల్ తో పాటు వాకింగ్‌ స్టైల్‌ ఇంకా మేనరిజం కూడా మ్యాచ్ అవుతున్నట్లుగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అతడిని చూస్తూ ఉంటే కచ్చితంగా కృష్ణ మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి విజయాలను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు.

సుధీర్‌ బాబు తాజాగా నటించిన సినిమా ను చూసేందుకు గాను చరిత్‌ స్నేహితులతో కలిసి ఏఎంబీ మాల్‌ కి వెళ్లాడు. అక్కడ తీసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఆకట్టుకునే ఫిజిక్ తో చరిత్‌ అప్పుడే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాడు.