విడిపోయినా వెకేషన్లు మాత్రం మిస్ అవ్వలేదు!
భార్యభర్తలుగా విడిపోయిన తర్వాత ఎవరి జీవితం వారిది. ఎవరి స్వేచ్ఛాయుత జీవితం వారు గడుపుతారు
By: Tupaki Desk | 20 July 2024 11:30 AM GMTభార్యభర్తలుగా విడిపోయిన తర్వాత ఎవరి జీవితం వారిది. ఎవరి స్వేచ్ఛాయుత జీవితం వారు గడుపుతారు. కానీ భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసే స్వేచ్ఛ మాత్రం ఉంటుంది. ఆ హక్కును సెలబ్రి టీలంతా దాదాపు వినియోగించుకుంటారు. పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తుంటారు. కొన్ని కండీషన్ల ప్రకారం ఇది జరుగుతుంటుంది.
కానీ విడిపోయిన తర్వాత తిరిగి హనీమూన్ కి వెళ్లడం, షికార్లు చేయడం వంటివి పెద్దగా కనిపించవు. తాజాగా ఈ జంటను చూస్తే పేరుకే విడాకులు మిగతావన్నీ సేమ్ టూ సేమ్ అన్నట్లే కనిపిస్తుంది. బుల్లితెర నటి చారు అసోపా- సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ 2019 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె జియానా కూడా ఉంది. కానీ ఈ జంట మనస్పర్దలు కారణంగా 2022లో విడిపోయారు.
కానీ పేరుకే విడిపోవడం పనులు మాత్రం కలిసే చేస్తున్నారు. కుమార్తెతో కలిసి హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గురు కలిసి విదేశాలకు వెకేషన్లకు వెళ్తున్నారు. ఈ మధ్యే దుబాయ్ కూడా వెళ్లొచ్చారు. దీనిగురించి చారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ట్రిప్ ఎంతో బాగా జరిగింది. జియానికి రాజీవ్ తండ్రి. అలాంటప్పుడు నా కూతుర్ని అతడి కుటుంబానికి ఎందుకు దూరంగా ఉంచుతాను.
అందుకే అందరం కలిసే వెళ్లాం. మా అత్తమ్మ సుస్మిత అంటే ఎంతో ఇష్టం. రాజీవ్ తో సంతోషంగా ఉన్నాను. విడిపోయినంత మాత్రాన బంధాలన్ని తెగిపోయినట్లు కాదు కదా. ఇద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం. జియానాని తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేరుస్తున్నాం` అని అన్నారు.