Begin typing your search above and press return to search.

'చౌర్య పాఠం'.. బటన్ నొక్కితే పాన్ ఇండియా సౌండ్ రావాలి

దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తన బేనర్ 'నక్కిన నేరేటివ్స్' కింద తీసుకొస్తున్న ఈ సినిమా మొదట్లోనే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2025 1:19 PM IST
చౌర్య పాఠం.. బటన్ నొక్కితే పాన్ ఇండియా సౌండ్ రావాలి
X

సినిమా పరిశ్రమలో కొత్త కథాంశాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

క్రైమ్, హీస్ట్ కాన్సెప్ట్‌లలో కథనం ఉన్నప్పటికీ, వాటిని ఎంటర్‌టైనింగ్‌గా ప్రెజెంట్ చేయగలిగితే ప్రేక్షకుల స్పందన కూడా వేరేలా ఉంటుంది. ఇక నెక్స్ట్ చౌర్య పాఠం అనే సినిమా ఈ నేపథ్యంలో ఆసక్తి రేపుతోంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తన బేనర్ ‘నక్కిన నేరేటివ్స్’ కింద తీసుకొస్తున్న ఈ సినిమా మొదట్లోనే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాతో యంగ్ హీరో ఇంద్ర రామ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అతని లుక్, పాత్ర డిజైన్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా ఆసక్తిని పెంచాయి. సలీం ఫీకు (మస్త్ అలీ) చాలా రోజుల తరువాత మళ్ళీ హైలెట్ అయ్యే పాత్రలో కనిపిస్తున్నాడు. గ్లింప్స్ లో రిలీజ్ టార్గెట్ సెట్టయినట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే హీస్ట్ టీమ్ లీడర్‌గా ఇంద్ర రామ్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

విడియోలో చూపించినట్టుగా హ్యూమర్, థ్రిల్, సస్పెన్స్ కలిపిన కథ ఇది. బటన్ నొక్కితే పాన్ ఇండియా సౌండ్ రావాలి.. అనే డైలాగ్ కూడా హైలెట్ అయ్యింది. ఈ చిత్రానికి దర్శకుడిగా నిఖిల్ గోల్లమారి పరిచయమవుతున్నారు. అతను చందూ మొండేటితో కలిసి కార్తికేయ 2 వంటి ప్రాజెక్టుల్లో పని చేసిన అనుభవం ఉండటంతో, కథనాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మలచిన విధానం పై ఆసక్తి పెరిగింది.

ఇప్పటికే విడుదలైన కన్నే కానే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నాగ చైతన్య లాంచ్ చేసిన ఈ సాంగ్ సినిమా మీద మరింత క్యూరియాసిటీని పెంచింది. పాటల పరంగా మంచి మ్యూజిక్ అందించిన దేవ్‌జాంద్ ఈ సినిమాకు కీలక బలంగా మారే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలు కార్తీక్ గట్టమనేని చూసుకున్నారు. ఇక సినిమాకు కథ కూడా అతనే అందించడం విశేషం. హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగళ నిర్మాణ డిజైన్‌లో కీలక పాత్ర పోషించారు.

వీరంతా కలిసి ఈ హీస్ట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు కొత్త అనుభూతిగా అందించేందుకు సిద్దమయ్యారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, సమ్మర్ స్టార్ట్ అయిన టైంలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అనిపిస్తోంది. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, యువతకు మంచి వినోదాన్ని అందించబోతోంది. సమ్మర్ సెలవులు స్టార్ట్ అవుతున్న టైమ్‌లో ఈ తరహా ఎంటర్‌టైనర్ విడుదల కావడం హాస్యంతోపాటు థ్రిల్లింగ్ అనుభూతిని పంచనుంది. మరి చౌర్య పాఠం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.