Begin typing your search above and press return to search.

చైతూ క్లీయర్‌.. మరి సామ్‌ ఎప్పుడో?

చైతూ దూత తో ఎదురు చూపులకు క్లీయర్‌ చేశాడు. ఇక సమంత సిటాడెల్‌ ఎదురు చూపులకు ఎప్పటికి తెర పడుతుందో చూడాలి.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:24 AM GMT
చైతూ క్లీయర్‌.. మరి సామ్‌ ఎప్పుడో?
X

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారిన వారు కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ ఉన్నారు. కాకతాళీయమో మరేంటో కానీ నాగ చైతన్య ధూత మరియు సమంత సిటాడెల్ వెబ్‌ సిరీస్ లు ఒకే సారి చేశారు. రెండు సిరీస్ లు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్‌ అవ్వకపోవడంతో ఫ్యాన్స్‌ ఎదురు చూశారు.


ఎప్పుడు ఎప్పుడు అంటూ సమంత, నాగ చైతన్య ఫ్యాన్స్ పదే పదే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వారిని సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో ఎట్టకేలకు ధూత వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ షురూ అయింది. నాగ చైతన్య ధూత కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సమంత సిటాడెల్‌ ఎప్పుడు అనే చర్చ మొదలు అయింది.

ధూత చాలా నెలల క్రితం షూటింగ్‌ పూర్తి అయ్యి ఇటీవల స్ట్రీమింగ్‌ కి రెడీ అయింది. ఇక సిటాడెల్‌ కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుని చాలా కాలం అవుతోంది. సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. కనుక ఆమె ప్రమోషన్స్ కోసం రావాలి కనుక సిటాడెల్‌ సిరీస్‌ ను వాయిదా వేస్తున్నారేమో అనే చర్చ కూడా జరుగుతోంది.

హాలీవుడ్‌ సిటాడెల్‌ సూపర్‌ హిట్ అవ్వడంతో హిందీ వెబ్‌ సిరీస్‌ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైతూ దూత తో ఎదురు చూపులకు క్లీయర్‌ చేశాడు. ఇక సమంత సిటాడెల్‌ ఎదురు చూపులకు ఎప్పటికి తెర పడుతుందో చూడాలి.