Begin typing your search above and press return to search.

12 కోట్లకు టోక‌రా : ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌పై చీటింగ్ కేసు!

థానే జిల్లాలో మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ క‌థ‌నం ప్ర‌చురించింది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:38 PM GMT
12 కోట్లకు టోక‌రా : ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌పై చీటింగ్ కేసు!
X

కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా బాలీవుడ్ లో పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీ అన్న సంగ‌తి తెలిసిందే. రెమో డిసౌజా, అతడి భార్య లిజెల్ డిసౌజాపై తాజాగా చీటింగ్ కేసు న‌మోదైంది. మహారాష్ట్రలో ఓ డ్యాన్స్ ట్రూప్‌ను రూ.11.96 కోట్ల మేర‌ మోసం చేసార‌నేది అభియోగం. థానే జిల్లాలో మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ క‌థ‌నం ప్ర‌చురించింది.

26 ఏళ్ల డ్యాన్సర్ ఫిర్యాదు మేరకు రెమో, అత‌డి భార్య‌పైనా కేసు నమోదు అయింది. అక్టోబర్ 16న మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌లో రెమో, లిజెల్ అలాగే మరో ఐదుగురిపై సెక్షన్ 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) స‌హా ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎఫ్‌.ఐ.ఆర్ ప్రకారం.. ఫిర్యాదుదారు అతడి బృందం 2018 నుంచి జూలై 2024 మధ్య మోసం జ‌రిగింద‌ని ఆరోపించారు. డ్యాన్స్ బృందం ఒక టెలివిజన్ షోలో ప్రదర్శన‌తో విజ‌యం సాధించింది. నిందితులు ఈ డ్యాన్స్ గ్రూప్ తమదేనంటూ పోజులిచ్చి రూ.11.96 కోట్ల ప్రైజ్ మనీని క్లెయిమ్ చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు ఓంప్రకాష్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవ్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేష్ గుప్తా ల‌పై విచారణ జరుగుతోందని పోలీస్ అధికారి తెలిపారు. రెమో 15 ఏళ్లుగా ఈ డ్యాన్స్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌గా కాకుండా రెమో 2009 నుండి అనేక డ్యాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు. అతడు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, ఝలక్ దిఖ్లా జా, డాన్స్ కే సూపర్‌స్టార్స్, డాన్స్ ప్లస్, డాన్స్ ఛాంపియన్స్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్, డిఐడి లిటిల్ మాస్టర్, DID సూపర్ మ‌ద‌ర్స్ వంటి షోల‌కు అత‌డు జ‌డ్జిగా ఉన్నారు. 2018 - 2024 మధ్య అతడు డ్యాన్స్ ప్లస్ (సీజన్‌లు 4, 5, 6), ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్, హిప్ హాప్ ఇండియా, డ్యాన్స్ ప్లస్ ప్రో వంటి వాటికి హోస్ట్‌గా కొన‌సాగాడు.

త‌దుప‌రి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అభిషేక్ బచ్చన్, ఇనాయత్ వర్మ నటించిన `బీ హ్యాపీ` విడుదలకు సిద్ధమవుతోంది. రెమో దర్శకత్వం వహించగా దీనిని లిజెల్ నిర్మించారు. ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని తెర‌పై చూపిస్తున్నారు. నోరా ఫతేహి, నాసర్, జానీ లివర్, హర్లీన్ సేథీ త‌దిత‌రులు నటించారు.