Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్, రకుల్ ప్రేమలో మాయ చేసే 'చెంగల్వ' సాంగ్

కమల్ హాసన్, శంకర్ కలయికలో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ సినిమా విడుదలకు టైమ్ దగ్గరపడుతోంది

By:  Tupaki Desk   |   29 May 2024 11:33 AM GMT
సిద్ధార్థ్, రకుల్ ప్రేమలో మాయ చేసే చెంగల్వ సాంగ్
X

కమల్ హాసన్, శంకర్ కలయికలో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ సినిమా విడుదలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ సినిమా రెండో సింగిల్ ‘చెంగల్వ’ ఇటీవల విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజికల్ మ్యాజిక్ తో ఈ పాట ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. మే 29 విడుదలైన ఈ పాట, అనిరుధ్ మ్యూజిక్ లోని ప్రత్యేకతను మరోసారి చూపిస్తుంది.

సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కనిపించిన ఈ సాంగ్, ప్రేక్షకులను రొమాంటిక్ యాత్రకు తీసుకెళ్తుంది. తెలుగు వెర్షన్ లో రామ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కు తగ్గట్టుగా, అబ్బీ వి మరియు శృతికా సముద్రాలా పాడిన విధానం పాటకు మరింత ప్రాణం పోశాయి. కమల్ హాసన్, శంకర్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథానాయకుడు 2లో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం సోషల్ డ్రామాగా ఉంటూ, అవినీతి వ్యతిరేకతను ప్రధానాంశంగా తీసుకుని వస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జూన్ 1న జరగనుంది. సోని మ్యూజిక్ ఆడియో హక్కులు సొంతం చేసుకుంది.

‘భారతీయుడు 2’ లో కమల్ హాసన్ మళ్ళీ వీరభద్ర సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. ఈ సిక్వెల్ లో ఎస్.జె. సూర్య, నేదుముడి వేణు, కలిదాస్ జయరామ్, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం, జాకిర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, శివాజీ గురువాయూర్, దీపా శంకర్, అనంత్ మహాదేవన్, జార్జ్ మరియన్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వివేక్, జి మరిముత్తు, మనోబాల లాంటి ప్రముఖుల దురదృష్టకర మరణాల నేపథ్యంలో, వారి పాత్రలు సరికొత్త టెక్నాలజీ అలాగే ఉంచడం జరిగింది. ఈ చిత్రం జూన్ 12 విడుదలకు సిద్ధమవుతోంది. ‘భారతీయుడు 2’ సినిమాతో రొమాంటిక్ మెలోడీ ‘చెంగల్వ’ సాంగ్ లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంట ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ పాటతో అనిరుధ్ మరోసారి తన మ్యూజిక్ తో ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు.